ప్రకాశం: ఒంగోలులోని కలెక్టర్ కార్యక్రమంలో ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నా అధికారులతో కలెక్టర్ తమిమ్ అన్సారియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో త్వరితగతిన రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ పాల్గొన్నారు.