PLD: పిడుగురాళ్లలోని మంగళవారం మధ్యాహ్నం పలు ఎరువుల దుకాణాల్లో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస రెడ్డి తనిఖీ చేశారు. ఇందులో భాగంగా స్టాక్ రిజిస్టర్, బిల్లు పుస్తకాలు పరిశీలించారు. ఎవరైనా ఎరువులు అధిక ధరలకు అమ్మినట్లయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని చెప్పారు.