మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సన్న రకం వడ్లకు ప్రభుత్వం ₹500 అదనంగా బోనస్ ఇస్తుందని వెల్లడించారు. రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ విక్రయ కేంద్రాల వద్ద విక్రయించి మంచి ధరను పొందాలన్నారు.