TG: కులగణన సర్వేను ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులగణనపై రాహుల్కు ఇచ్చిన మాట నెరవేర్చడమే తమ కర్తవ్యమన్నారు. కులగణనను మాటల్లో కాదని.. చేతల్లో చూపాలన్నదే రాహుల్ ఆలోచన అన్నారు. కులగణన పూర్తి చేసి.. బీసీలకు అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని స్పష్టం చేశారు. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.