TG: రాష్ట్రంలో అన్ని దేవాలయాలకు విజయ డెయిరీ నెయ్యినే సరఫరా చేస్తామని తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ సొసైటీ ఛైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి తెలిపారు. తిరుపతి లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇక నుంచి పాల అమ్మకాలు మరింత పెంచడానికి ప్రభుత్వ కార్యాలయాలకు, హాస్టళ్లకు, జైళ్లు, హస్పిటల్స్‌కు పాలు, పాల పదార్థాలు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. అలాగే పెండింగ్ బిల్లులను కూడా త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు.