»Which Dry Fruit Is Beneficial In Summer Season To Keep Your Body Cool
Dry Fruits : వేసవిలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదేనా ?
Dry Fruits : సాధారణంగా చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటారు. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వేసవి కాలంలో ఆహారం, పానీయాలకు కొంచెం దూరంగా ఉంటారు.
Dry Fruits : సాధారణంగా చలికాలంలో డ్రై ఫ్రూట్స్(Dry Fruits) ఎక్కువగా తింటారు. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వేసవి కాలం(Summer)లో ఆహారం, పానీయాలకు కొంచెం దూరంగా ఉంటారు. అదే విధంగా డ్రై ఫ్రూట్స్ విషయంలోనూ జనాలు తికమక పడుతుంటారు. ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం సరైందా కాదా అని.. వేసవిలో మీరు డ్రై ఫ్రూట్స్లో వాల్నట్(Walnuts)లను నిరభ్యంతరంగా తినవచ్చు. నిజానికి వాల్ నట్స్ లో ఉండే కొన్ని గుణాలు వేసవిలో శరీరానికి మేలు చేస్తాయి.
వాల్నట్స్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్(Fatty Acids)లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన శరీరానికి అలాగే మెదడుకు చాలా మేలు చేస్తాయి. వాల్నట్లు కడుపులో మంటను తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. కాబట్టి సమ్మర్ డైట్(Diet)లో వాల్నట్స్ను ఎలా చేర్చుకోవాలో తెలుసుకుందాం.
రాత్రి పడుకునే ముందు పాలలో ఉడకబెట్టిన లేదా గోరువెచ్చని పాలలో నానబెట్టిన వాల్నట్లను తీసుకోవచ్చు. ఇది వాల్నట్ల వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. షేక్స్, స్మూతీలను వాల్నట్ ముక్కలతో అలంకరించి చక్కగా లాగించవచ్చు. వేసవిలో వాల్నట్లను తినడానికి ఇది చాలా రుచికరమైన మార్గం. కొత్తిమీర, పుదీనాతో వాల్నట్లను మిక్స్(MIX) చేసుకుని తినవచ్చు. ఇది శరీరంలోని వేడిని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. సలాడ్ లేదా పెరుగులో వాల్నట్లను వాడుకోవచ్చు. రాత్రిపూట నీటిలో 2 ముక్కల వాల్నట్ను నానబెట్టి… ఉదయం ఖాళీ కడుపుతో తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.