The price of tomatoes has risen. In Madhya Pradesh Rs. 160
ఈ రోజుల్లో ధనవంతులు కూడా టమాటా(tomato) కర్రీ వండాలంటే ఒక్క క్షణం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వీటి రేటు చూసి వినియోగదారులు దడుసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా టమాటాలను ముట్టుకుంటే చాలు భగ్గుమంటున్నాయి. ఇక సామాన్యులు, ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్న వారికి టమాటాలే ఊరట. కానీ ఇప్పుడు వాటి ధర చూస్తే సామాన్యుల ఊపిరి ఆడటం లేదు. గత కొన్ని రోజులుగా వీటి ధర మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతటా కిలో రూ. 100 పలికింది. ఇప్పుడు ఆ ధర కిలో రూ. 150 కూడా దాటిపోయింది.
ఇక మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని రాయ్సెన్ జిల్లాలో కిలో టమాటా ధర రూ.160 చేరింది. అలాగే దేశంలోని మరి కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.120 నుంచి రూ.150 వరకు పలుకుతున్నాయి. టమాటాల వినియోగం పెరగడం, వేసవి కారణంగా కొరత ఏర్పడడం వంటి కారణాలతో వీటి రేట్లు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. పేదలకు, సామాన్యులకు టమాటాలను అందుబాటు ధరలో అందించేందుకు అనేక రాష్ట్రాలు చోరువ తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని రైతు బజార్లలో కిలో రూ.50కే టమాటా(tomato)లను అందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.