»The Government Gave A Big Blow To The Drunkards In Karnataka
Karnataka: ఈ రాష్ట్రంలో మద్యం చాలా కాస్ట్లీ.. ఎక్సైజ్ సుంకం భారీగా పెంచిన ప్రభుత్వం
2023-24 బడ్జెట్లో అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో కర్ణాటకలో బీరుతో సహా మద్యం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను సమర్పించారు.
Karnataka: మీరు మందుప్రియులా.. అయితే మీకో బ్యాడ్ న్యూస్ .. ఇకనుంచి మందు కొనుక్కోవాలంటే మీ ఆస్తులు అమ్ముకోవాల్సిందే. 2023-24 బడ్జెట్లో అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో కర్ణాటకలో బీరుతో సహా మద్యం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను సమర్పించారు. మొత్తం 18 శ్లాబ్‌లలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL)పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీ రేట్లను 20శాతం పెంచాలని సూచించారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో 5 ఎన్నికల వాగ్దానాలు చేసిన సీఎం సిద్ధరామయ్య.. ఈ ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు కసరత్తు చేస్తున్నారు.
మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని 20 శాతం పెంచడం వల్ల వివిధ బ్రాండ్ల మద్యం ధర పెరుగుతుంది. బీరుపై 10 శాతం ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు. ఈ మార్పుల ప్రకారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీర్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 175శాతం నుండి 185శాతానికి పెంచారు. దీంతో కర్ణాటకలో బీరుపై పన్ను రేటు పెరుగుతుంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. మద్యంపై ఎక్సైజ్ సుంకం పెంచిన తర్వాత పొరుగు రాష్ట్రాలతో పోల్చినా.. పొరుగు రాష్ట్రాల కంటే కర్ణాటకలో మద్యం ధర తక్కువగానే ఉంది.
2023-24లో మరిన్ని నియంత్రణ చర్యల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ. 36,000 కోట్ల ఆదాయ సేకరణ లక్ష్యంగా నిర్ణయించినట్లు సిద్ధరామయ్య తన బడ్జెట్లో తెలిపారు. ఇది కాకుండా, ప్రభుత్వం ఐదు ‘హామీల’ (ఎన్నికల వాగ్దానాలు) ద్వారా రూ. 3.27 లక్షల కోట్లకు పైగా ఖర్చుతో ప్రతి ఇంటికి నెలకు రూ. 4,000 నుండి 5,000 అదనపు ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రభుత్వం తన బడ్జెట్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పేదలకు 10 కిలోల ఉచిత రేషన్, ఇంటి పెద్దలకు రూ.2,000, నిరుద్యోగ భృతి రూ.3,000తో సహా ఎన్నికల వాగ్దానాలు చేసింది. మాజీ సీఎం రామకృష్ణ హెగ్డే రికార్డును అధిగమించి ఆర్థిక మంత్రిగా సిద్ధరామయ్య తన 14వ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించారు.