»Telangana State Formation Day Cm Kcr To Celebrate 21 Days Dashabdi Festival
Telangana @10 Years : నేటి నుంచి తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు.. అంబరాన్ని అంటేలా సంబరాలు
పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తొమ్మిదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ, పదవ వసంతంలోకి అడుగిడుతున్న చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల(Telangana state's birth decade celebrations)ను అత్యంత వైభవోపేతంగా జరుపుకునేందుకు రాష్ట్రం సిద్ధమైంది.
Telangana @10 Years : పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తొమ్మిదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ, పదవ వసంతంలోకి అడుగిడుతున్న చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల(Telangana state’s birth decade celebrations)ను అత్యంత వైభవోపేతంగా జరుపుకునేందుకు రాష్ట్రం సిద్ధమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి జూన్ 1తో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది.ఈరోజు జూన్ 2వ తేదీకి పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అదేంటంటే.. ఈరోజు తెలంగాణ 10వ పుట్టిన రోజు. అందుకే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను 21 రోజుల పాటు జరుపుకుంటోంది. ఈ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
ఇవాళ హైదరాబాద్‌లోని గన్‌పార్క్(Gunpark)లో సీఎం కేసీఆర్ నివాళులర్పించి దశాబ్ది వేడుకలను ప్రారంభించనున్నారు. అనంతరం సచివాలయ ప్రాంగణంలో జాతీయ జెండా(National Flag)ను ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడింది? ఎంత మంది త్యాగాల తర్వాత రాష్ట్రం వచ్చింది? ఈ 9 ఏళ్లలో రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది? ఇంకా సాధించాల్సింది ఏమిటి? తదితర అంశాలపై సీఎం కేసీఆర్(CM KCR) సందేశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ దశాబ్ది వేడుకలు నేటి నుంచి 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. జూన్ 3న రైతు దినోత్సవం, 4న పోలీసు శాఖ భద్రతా దినోత్సవం, 5న విద్యుత్ విజయోత్సవం, 6న సింగరేణి సంబరాలు, పారిశ్రామికోత్సవం, పారిశ్రామిక ఐటీ కారిడార్లలో సమావేశాలు, 7న నీటిపారుదల దినోత్సవం, 8న చెరువుల పండుగ, 9న కల్యాణ సంబరాలు 10న సుపరిపాలన దినోత్సవం, 12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న వైద్య దినోత్సవం, 15న గ్రామీణ ప్రగతి దినోత్సవం, 16న పట్టణ ప్రగతి దినోత్సవం, 17న గిరిజనోత్సవం, 18న మంచినీటి పండుగ, 19న హరితహారం , 20న విద్యా దినోత్సవం, 21న ఆధ్యాత్మిక దినోత్సవం, 22న అమరవీరులకు నివాళులు, స్మారక చిహ్నం ప్రారంభోత్సవం.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా ఇన్ఛార్జ్(Incharge)లను నియమించింది. జిల్లా ఇన్చార్జీలు ఆయా జిల్లాల్లో జాతీయ జెండాను ఎగరవేసి దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్నారు. వేడుకలను పురస్కరించుకుని ఇప్పటికే ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, స్మారక చిహ్నాలు, భవనాలను అధికారులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం రంగులతో వెలిగిపోతోంది. అలాగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు. సచివాలయంలో ప్రారంభోత్సవ ఏర్పాట్ల కోసం శాఖల వారీగా 13,398 మంది అధికారులను నియమించారు. వేడుకలకు అన్ని శాఖల నుంచి 7,250 మందిని ఆహ్వానించారు. వీరి కోసం 151 బస్సులను ఏర్పాటు చేశారు.