చైనాకు లక్ష కోతులను శ్రీలంక ఎగుమతి చేయనుంది. శ్రీలంకలోని వివిధ ప్రాంతాల్లో అరుదైన ‘టోక్ మకాక్’ కోతులు(toque macaque monkeys) ఉన్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ద్వారా అవి అంతరించిపోతున్న జాతులుగా వర్గీకరించబడ్డాయి.
Srilanka : చైనాకు లక్ష కోతులను శ్రీలంక ఎగుమతి చేయనుంది. శ్రీలంకలోని వివిధ ప్రాంతాల్లో అరుదైన ‘టోక్ మకాక్’ కోతులు(toque macaque monkeys) ఉన్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ద్వారా అవి అంతరించిపోతున్న జాతులుగా వర్గీకరించబడ్డాయి. శ్రీలంకలో ఆ కోతులు 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇవి పంటలను ధ్వంసం చేయడంతోపాటు ఒక్కోసారి ప్రజలపై దాడికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి.
ఈ సందర్భంలో శ్రీలంక వ్యవసాయ మంత్రి మహింద అమరవీరా(Mahinda Amaraweera) గత వారం మాట్లాడుతూ.. చైనా(China)లోని వెయ్యికి పైగా జంతుప్రదర్శనశాలల(Zoo)లో టోక్ మకాక్(toque macaque) కోతులను ప్రదర్శించాలని చైనా కోరింది. ఈ అభ్యర్థనను పరిశీలిస్తున్నామన్నారు. నిజానికి దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో సజీవ జంతువుల ఎగుమతిని శ్రీలంక నిషేధించింది. దీంతో పర్యావరణ, వన్యప్రాణుల సంరక్షకుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ ఎగుమతి గురించి తమకు ఏమీ తెలియదని శ్రీలంక(Srilanka)లోని చైనా రాయబార కార్యాలయం(Chinese Embassy) గత మంగళవారం తెలిపింది.
ఇదిలావుండగా, శ్రీలంక వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి గుణదాస సమరసింఘే(Gunadasa Samarasinghe ) ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, “చైనాలోని జూతో సంబంధం ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీ 1 లక్ష ‘టోక్ మకాక్’ కోతుల కోసం మా మంత్రిత్వ శాఖను కోరింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కోతుల వల్ల పంట నష్టం జరిగినందున మేము ఈ అభ్యర్థనను పరిగణించాం. మేము వీటిని ఒకేసారి పంపం. రక్షిత అటవీ ప్రాంతాల నుంచి వీటిని పట్టుకోవడం లేదు. సాగు ప్రాంతాలపై దాడి చేస్తున్న కోతులపై మాత్రమే దృష్టి సారించి వారిని పట్టుకుంటాం’’ అని చెప్పారు.