హైదరాబాద్ నగరంలోని గోషా మహల్ లో జరిగిన ఓ సంఘటన స్థానికంగా అందరినీ విస్మయానికి గురి చేసింది. గోషామహల్ లో రోడ్డు ఒక్కసారిగా లోపలికి కుంగిపోయింది. ఒక్కసారిగా భూకంపం సంభవించిందేమోనని స్థానికులు భయపడిపోయారు. కానీ…. చాక్నవాడిలో పెద్ద నాలా కుంగిపోయిన నేపథ్యంలో రోడ్డు కూడా కుంగిపోయింది. ఈ క్రమంలో నాలాపై ఉన్న కార్లు, ఆటోలు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి.
శుక్రవారం కావడంతో బస్తీలో ఏర్పాటు చేసిన మార్కెట్ లో పెద్ద ఎత్తున జనాలు కూడా పోగయ్యారు. ఈ క్రమంలో మార్కెట్లో ఏర్పాటు చేసుకున్న కూరగాయల దుకాణాలు అక్కడ యబ్బ వాహనాలు సైతం సహా నాలాలో పడి పోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
పెద్ద ఎత్తున్న మార్కెట్ కు వచ్చి ఆ నాలాను చూసేందుకు ఎగబడుతున్న జనాలను పోలీసులు నియంత్రిస్తూ అక్కడి నుంచి దూరం పంపిస్తున్నారు. అయితే అసలు నాలా కుంగడానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఎప్పుడూ లేనిది నాలా కుంగిపోవడం జనానికి గాయాలు కావడంతో స్థానికులు భయందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఏమి కులుతాయో అని ఆందోళనలో స్థానికులు ఉన్నారని తెలుస్తోంది.