నటీనటులు – రిషబ్ శెట్టి, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమి గౌడ రచన, దర్శకత్వం – రిషబ్ శెట్టి నిర్మాత – విజయ్ కిరగందూర్, తెలుగులో అల్లు అరవింద్ హక్కులు తీసుకున్నారు సంగీతం – బి.అజనీష్ లోక్‌నాథ్ సినిమాటోగ్రఫీ – అరవింద్ ఎస్.కశ్యప్ ప్రొడక్షన్ కంపెనీ – హోంబలే ఫిల్మ్స్
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కేజీఎఫ్ మూవీ రికార్డులు మరువక ముందే…మరో సినిమా కాంతార(kantara) ఎంట్రీ ఇచ్చింది. రిషబ్‌శెట్టి(rishab shetty) హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం..సెప్టెంబర్ 30న కన్నడ బాషలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు IMDbలో కేజీఎఫ్ కంటే… అత్యధికంగా 9.6 రేటింగ్ సాధించి రికార్డు సృష్టించింది. యష్ KGF 2 చిత్రానికి 8.4, రాజమౌళి RRR మూవీకి 8 రేటింగ్ రావడం విశేషం. పెద్ద చిత్రాల కంటే ఎక్కువ రేటింగ్ వచ్చిన ఈ సినిమా రైట్స్ తెలుగులో అల్లు అరవింద్ తీసుకుని..అక్టోబర్ 15న విడుదల చేశారు. మరోవైపు ఈ సినిమాను ప్రముఖ హీరోలు ప్రభాస్, ధనుష్ చూసి చాలా బావుందని మెచ్చుకున్నారు. దీంతో తెలుగులోను ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ఈ సందర్భంగా మూవీ స్టోరీ ఎంటో ఇప్పుడు చుద్దాం.
స్టోరీ
ఇక కథలోకి వెళ్తే కాంతార అంటే ఫారెస్ట్ అని అర్థం. ఓ ఊర్లో మంచి సంపద ఉన్న భూస్వామ్య ప్రభువు ఉండగా…ఆ గ్రామ ప్రజలకు ఆ కుటుంబమే అండగా ఉండేది. కానీ అతను ఏదో తెలియని లోటుతో విచారణగా ఉండేవాడు. ఆ క్రమంలో ప్రభువు అడవిలో వెళుతుండగా..ఓ దేవుడి శిల దొరకడంతో అతనికి ప్రశాంతత లభిస్తుంది. కానీ ఆ దేవుడి విగ్రహాన్ని తిరిగి ఇవ్వాలని అతన్ని స్థానిక ప్రజలు కొరతారు. ఆ శిలకు బదులు అడవిలో భూమి మొత్తాన్ని ప్రజలకు ఇవ్వాలని, మళ్లీ ఆ భూమిని ప్రజల నుంచి తీసుకోవద్దని…ఆ ప్రభువుతో దేవుడు మాట తీసుకుంటాడు. కానీ మాట తప్పిన ప్రభువు కుటుంబం మళ్లీ ల్యాండ్ తీసుకునేందుకు చేసిన కుట్రలు ఎంటీ? ఆ క్రమంలో హీరో గ్రామాన్ని ఎలా కాపాడుకుంటడనేది అసలు స్టోరీ.
రిషబ్ శెట్టి దోస్తులతో కలిసి ఫారెస్టులోకి వేటకు వెళ్లగా…అదే క్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్ మురళి వారిని అడ్డుకుంటాడు. హీరో శివ చేస్తున్న పనులను చూసి స్మగ్లర్ అని భావిస్తాడు. చట్టం అందరికీ సమానమేనని వారితో చెబుతాడు. మరోవైపు ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకుని…మరళీ ఊరికి సరిహద్దులు పెట్టే ప్రయత్నం చేస్తాడు. అదే క్రమంలో శివ ప్రియురాలు లీల ఫారెస్ట్ డిపార్టుమెంటులో గార్డుగా చేరి అక్కడి అధికారులకు సాయం చేస్తుంది. కానీ అనుకోని సంఘటనల వల్ల శివ జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత ధైవాన్ని ఆరాధించే శివ స్నేహితుడు అనుకోకుండా చనిపోతాడు. విషయం తెలిసిన హీరో…తన ఫ్రెండ్ హత్య వెనుక ఎవరు ఉన్నారు? ఫారెస్టు అధికారికి హత్యకు సంబంధం ఉందా అని తెలుసుకుంటాడు. అసలు హత్య చేసింది ఎవరు సహా అనేక విషయాలు తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
రిషబ్ శెట్టి ఈ చిత్రానికి స్టోరీ అందించడంతోపాటు దుమ్మురేపే యాక్టింగ్ చేశాడని చెప్పవచ్చు. మాస్ క్యారెక్టర్లో దేవుడు వచ్చినపుడు అరుపులు చేస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించాడు. డైలాగ్స్, కామెడీ, ఉత్కంఠ రేపు సన్నీవేశాలు కూడా అదిరిపోయాయి. మొత్తంగా రిషబ్ శెట్టి తన పాత్రలో లీనమై నటించాడు. ఇక హీరోయిన్ లీలగా సప్తమీ గౌడ కూడా తన పాత్ర మేరకు న్యాయం చేసింది. మరోవైపు ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కిషోర్, భూస్వామి ప్రభువుగా అచ్యుత్ కుమార్ సహా పలువురు తమ దైన శైలిలో నటించి మెప్పించారు.
సాంకేతిక అంశాల విషయానికి వస్తే…
ఇక మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు మంచి బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. కొన్నీ సీన్లలో మ్యూజిక్ వేరే లెవల్‌కు తీసుకెళ్లాడని చెప్పవచ్చు. ఓ వైపు నేపథ్య సంగీతంతోపాటు వోకల్స్ ను కూడా మిక్స్ చేసి అదిరిపోయే సంగీతం అందించాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన అరవింద్ కశ్యప్ పనితీరు చాలా బాగుందని చెప్పవచ్చు. తక్కువ లోకేషన్లతో ఫారెస్టులో అద్భుతమైన విజువల్ వండర్ గా చూపించారు. ఇక లాస్ట్ 20 నిమిషాలైతే సరికొత్త ఎక్స్ పీరియన్స్ అని చెప్పవచ్చు. దీంతోపాటు ఇతర డిపార్ట్ మెంట్లు కూడా మంచి వర్క్ చేశాయి.
చివరిగా…
ఈ సినిమాకు హీరో, డైరెక్టర్ ఒక్కడే అయిన రిషబ్ శెట్టి సరికొత్త స్టోరీని ఎంచుకుని పద్దతిగా తెరకెక్కించాడు. ఎక్కడా కూడా ఓవర్‌గా సీన్లను చూపించలేదు. మరోవైపు కన్నడ సంస్కృతి, కంబాల క్రీడ సహా పలు అంశాలను చక్కగా చూపించాడు. సినిమా స్టోరీతోపాటు టెక్నికల్ అంశాలను కూడా సరిగ్గా వాడుకున్నాడని చెప్పవచ్చు. కథలో దైవత్వం గురించి చెబుతూ మరోవైపు స్థానిక ప్రజల ఎమోషన్స్, వివాదాన్ని చక్కగా న్యారేట్ చేశాడు. మొత్తంగా ఈ స్టోరీని ప్రేక్షకులకు చెప్పడంలో రిషబ్ శెట్టి విజయం సాధించాడని చెప్పవచ్చు. కానీ ఈ చిత్రాన్ని థియోటర్లో చూస్తేనే మంచి కిక్కు దొరుకుతుందని సినీ అభిమానులు అంటున్నారు. చివరిగా ఈ చిత్రానికి ఐదు రేటింగ్‌కి 4 ఇవ్వొచ్చని చెబుతున్నారు.