కృష్ణా: బాపులపాడు(M) వేలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో 11వ తరగతి ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డీ. యదునం దన తెలిపారు. మొదట వచ్చిన వారికి ప్రాధాన్యం క్రమంలో స్పాట్ అడ్మిషన్లు కల్పించనున్నామని ఆయన పేర్కొన్నారు. గణితం, సామాన్యశాస్త్రంలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలని, వారు ఈ నెల 23వ తేదీ వరకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.