VSP: గొలుగొండ (M) కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భీమవరం చెక్ పోస్ట్ పరిసర ప్రాంతాల్లో రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో బుధవారం గంజాయి అక్రమ రవాణాపై డ్రోన్ కెమెరాతో పరిశీలించారు. గంజాయి ఎవరు తరలించినా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. అలాగే గంజాయి రవాణాపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. గొలుగొండ ఎస్ఐ పి. రామారావు, తదితరులు పాల్గొన్నారు.