ELR: నూజివీడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధానాధికారి రజిత తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 27 సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు కాపీతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లను అదే రోజు వెరిఫికేషన్ చేయించుకోవాలని ఆమె పేర్కొన్నారు.