TG: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ను ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అంబేద్కర్ను చంచల్గూడ జైలుకు తరలించారు. కాగా, నిన్న ఏసీబీ అధికారులు మణికొండలోని అంబేద్కర్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.