AP: మాచర్లలో చాలాకాలం ప్రజాస్వామ్యం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. కొందరు నేతలు రౌడీయిజంతో విధ్వంసం చేశారని మండిపడ్డారు. ఇక్కడ అనేకసార్లు చాలా అరాచకాలు జరిగాయని.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలపై దాడి చేశారని గుర్తు చేశారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేశానని తెలిపారు. పల్నాడులో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.