ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని స్థానిక కంభం బస్టాండ్ సెంటర్ నందు శనివారం సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సీఐ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. అనంతరం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.