WGL: బతుకమ్మ విశిష్ఠతను విశ్వవ్యాప్తం చేసేలా ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ నెల 21 నుంచి 30 వరకు బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ నెల 21వ తేదీన హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయం వద్ద బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.