మెగా హీరో సాయి దుర్గా తేజ్‌తో దర్శకుడు రోహిత్ KP తెరకెక్కిస్తోన్న మూవీ ‘సంబరాల యేటిగట్టు’. SEP 25న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ప్రేక్షకులకు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు మూవీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నామని, త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు.