NLG: నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందేందుకు ఎందరో వీరులు అసువులు బాసారు. నిజాం నవాబ్కు గ్రామాల్లో కొంతమంది కొమ్ముకాస్తూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారు. త్యాగధనుల రక్తతర్పణమే నేటి స్వేచ్ఛాయుత తెలంగాణ. తెలంగాణ సాయుధ పోరాటానికి నల్గొండ జిల్లా నాంది పలికింది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా యోధులు ఎందరో.. మరెందరో పోరాటంలో పాల్గొన్నారు.