KDP: UTF ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై రణభేరి కార్యక్రమం కరపత్రాలను జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ బాబు వేంపల్లిలో మంగళవారం విడుదల చేశారు. ఈనెల 15 నుంచి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్, బదిలీలు, ప్రమోషన్స్, మినిమం టైం స్కేల్ వంటి సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.