MDK: నార్సింగి మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు సంధిగారి లింగమ్మ (108) మంగళవారం మృతి చెందింది. లింగమ్మ భర్త భూమాగౌడ్ 50 ఏళ్ల క్రితం మృతి చెందాడు. వృద్ధురాలికి ఓ కూతురు, ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు పదేళ్ల క్రితం మృతి చెందాడు. చిన్న కుమారుడు నారాగౌడ్ అంత్యక్రియలు నిర్వహించాడు.