సత్యసాయి: నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మంచి ఆరోగ్యంతో పాటు దేశ సేవలో దీర్ఘాయుష్షు పొందాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఆయన దార్శనిక నాయకత్వంలో మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.