Realme 11 Pro : రియల్ మీ 11 ప్రో సిరీస్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Realme 11 Pro సిరీస్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. Realme వినియోగదారుల కోసం మరోసారి కొత్త ఫీచర్లతో స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది.
Realme 11 Pro : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Realme 11 Pro సిరీస్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. Realme వినియోగదారుల కోసం మరోసారి కొత్త ఫీచర్లతో స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చింది. కంపెనీ Realme 11 Pro, Realme 11 Pro Plus సిరీస్ అనే రెండు మోడళ్లను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యాయి. ముఖ్యంగా, Realme Pro Plus 200MP కెమెరాను కలిగి ఉంది. మూన్ షాట్లతో సహా సమానంగా ఆకట్టుకునే ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. ఈ ఫోన్లు త్వరలో Amazon, Realme వెబ్సైట్లో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.
రూ.2 వేల తగ్గింపు పొందే అవకాశం
Realme 11 Pro 5G.. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 23,999. 8GB + 256GB వేరియంట్ ధర రూ. 24,999 మరియు 12GB + 256GB వేరియంట్ ధర రూ. 27,999. మరోవైపు, Realme 11 Pro+ 5G 8GB + 256GB ధర రూ.27,999 మరియు 12GB + 256GB ధర రూ.29,999. జూన్ 8 సాయంత్రం 6-8 గంటల మధ్య ఈ ఫోన్ కొనుగోలు చేస్తే 2 వేల తగ్గింపు పొందవచ్చు. వివిధ బ్యాంకు కార్డులపై రియల్ మీ ప్రో 5జీ ప్లస్ కొనుగోలుపై రూ.2 వేలు, రియల్ ప్రో ప్లస్ పై రూ.1500 వరకు తగ్గింపును కంపెనీ అందిస్తుంది.