ఈ ఏడాది వచ్చిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ.. సినిమాలతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు మాస్ మహారాజా రవితేజ. దాంతో రిలీజ్‌కు రెడీ అవుతున్న ధమాకా(dhamaka) పైనే రవితేజ(ravi teja) అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన్ మాస్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. దాంతో అక్టోబర్ 21, ఉదయం 10:01 గంటలకు మాస్ క్రాకర్ టీజర్(teaser) రిలీజ్ చేశారు.
ఇక ఈ టీజర్ మాస్ మహారాజా స్టైల్లో కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంది. ఇందులో చాలా పవర్ ఫుల్‌గా కనిపించాడు రవితేజ. తనదైన మార్క్ మాస్ డైలాగ్స్.. కామెడీ టైమింగ్ మరియు హై ఓల్టేజ్ ఫైట్స్‌తో రాబోతున్నాడని చెప్పొచ్చు. ఇందులో రవితేజ పక్కా మాస్ రోల్‌తో పాటు.. స్టైలిష్ అండ్ క్లాసిక్‌గా.. రెండు డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అలాగే భీమ్స్ సిసిరోలియో బ్యక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేలా ఉంది.
దాంతో ఈ దీపావళికి మాస్ జాతరేనని చెప్పొచ్చు. మొత్తంగా ధమాకా టీజర్ చూస్తే.. మాస్ మహారాజా సాలిడ్ కం బ్యాక్ ఇవ్వడం పక్కా అంటున్నారు అభిమానులు. ఇక టీజర్‌తో పాటే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. డిసెంబర్ 23న ధమాకాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. మరి ధమాకా ‘డబుల్ ఇంపాక్ట్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న రవితేజ.. ఈ సారి ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.