»Rana Daggubatis Wife Miheeka Shares Unseen Holiday Pics In Anniversary Post
Rana: వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆసక్తికర ఫోటోలు షేర్ చేసిన రానా భార్య
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మిహీకా బజాజ్ తన వెకేషన్లో తీసుకున్న కొన్ని చూడని సెల్ఫీలను షేర్ చేసింది. ఫోటోలో రానా, మిహీకా సెల్ఫీ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మరో దానిలో వారు కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించినప్పుడు స్టేడియంలో క్లిక్ చేసిన క్షణం.
Rana:రానా దగ్గుబాటి – మిహీకా బజాజ్ ను పెళ్లి చేసుకుని మూడేళ్ల గడిచిపోయాయి. తమ అన్యోన్య అనుబంధంతో అందరి మనసులు గెలుచుకున్నారు. రానా సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా లేనప్పటికీ, అతని భార్య మిహీకా దానికి న్యాయం చేస్తుంది. వారి వైవాహిక ఆనందానికి సంబంధించిన ఫోటోలను మిహీకా బజాజ్ తరచుగా పోస్ట్ చేస్తుంది. రానా భార్య తాజాగా వారు హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మిహీకా బజాజ్ తన వెకేషన్లో తీసుకున్న కొన్ని చూడని సెల్ఫీలను షేర్ చేసింది. ఫోటోలో రానా, మిహీకా సెల్ఫీ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మరో దానిలో వారు కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించినప్పుడు స్టేడియంలో క్లిక్ చేసిన క్షణం. మిహీకా తన భర్తను ముద్దుగా ఇల్లు అని పిలుస్తూ క్యాప్షన్ పెట్టింది. రానా, మిహీకా బజాజ్ 8 ఆగస్టు 2020న వివాహం చేసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నారు. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రానాతో అన్ని చిత్రాలను పంచుకుంది.
పెళ్లయినప్పటి నుంచి మిహీక ప్రెగ్నెన్సీ రూమర్స్‌ను ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ ఆ పుకార్లను కొట్టిపారేశారు. తను భార్య గర్భవతి కాదని రానా స్పష్టం చేశాడు. రానా ఇటీవలే తన రాబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ హిరణ్యకశిపు అనే కాన్సెప్ట్ టీజర్‌ను ఆవిష్కరించారు. ఇది అమర్ చిత్ర కథా కామిక్స్ నుండి ప్రేరణ పొందింది. హిరణ్యకశిపు చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు.