»Bholashankar Movie Case Against The Producer Postponing The Release Of The Movie
Bholashankar: ప్రొడ్యూసర్ పై కేసు..సినిమా రిలీజ్ వాయిదా?
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ యాక్ట్ చేసిన భోళాశంకర్ మూవీ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాతలు ఓ వ్యక్తికి డిస్ట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పి మోసం చేశారని వైజాగ్ కు చెందిన ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశారు. తనకు న్యాయం జరిగే వరకు ఈ మూవీ రిలీజ్ చేయోద్దని కోరుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన భోళా శంకర్ సినిమా విడుదలకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు అభిమానుల్లో మంచి ఉత్సాహాన్ని నింపాయి. ఒకవైపు మొహర్ రమేష్ ఫ్లాపులతో భయపడుతుంటే..మరోవైపు ఇది బాస్ సినిమా, అందులో చిరు వీరాభిమాని కాబట్టి సినిమాలో స్టఫ్ మాములుగా ఉండదని అభిమానులు ధీమాగా ఉన్నారు. మరోవైపు బిజినెస్ లెక్కలపై కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు. సాలిడ్ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తోపాటు సినిమా బృందం పీక్ లెవల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. కానీ అంతలోనే ఈ సినిమాను వాయిదా వేయాలని ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు.
ఇక వివరాల్లోకి వెళితే వైజాగ్లో సతీష్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే భోళాశంకర్ మూవీ నిర్మించిన నిర్మాతలు ఏజెంట్ చిత్రాన్ని కూడా నిర్మించారు. అయితే ఏజెంట్ మూవీ రిలీజ్ సమయంలో తనకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రైట్స్ ఇస్తారని ఈ నిర్మాతలు చెప్పారని బాధితుడు సతీష్ అంటున్నారు. అంతేకాదు అందుకోసం తాను నిర్మాతలు సుంకర అనిల్, గరికపాటి కిషోర్ గార్లకు రూ.30 కోట్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. కానీ ఏజెంట్ సినిమా విడుదలైన తర్వాత అగ్రిమెంట్ ప్రకారం కాకుండా తనకు కేవలం వైజాగ్ పరిధిలో మాత్రమే డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారని బాధితుడు సతీష్ తెలిపారు. ఈ నేపథ్యంలో తాను ఇచ్చిన డబ్బులు 45 రోజుల్లో తిరిగి ఇస్తానని నిర్మాతలు చెప్పినప్పటికీ ఇంకా ఇవ్వలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాను కోర్టును ఆశ్రయించినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో భోళా శంకర్ మూవీ వాయిదా వేయాలని.. తనకు న్యాయం జరిగిన తర్వాతనే ఈ నిర్మాతలు నిర్మించిన భోళా శంకర్ చిత్రాన్ని రిలీజ్ చేయాలని కోరుతున్నారు.