»Hero Ranas Emotional Comments That Problem Remains
Rana Daggubati : హీరో రానా ఎమోషనల్ కామెంట్స్… ఆ సమస్య అలాగే ఉంది
టాలీవుడ్ లో(Tollywood) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి(Rana Daggubati). సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా, ఆ ఛాయలేవీ తన సినిమాలపై పడకుండా, కేవలం ప్రతిభనే నమ్ముకున్నాడు. తాజాగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ (Web series) లో బాబాయి విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh) తో కలిసి నటించాడు. ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో రానా ఆసక్తికర అంశాలు(Interesting facts) వెల్లడించాడు. తనకు కుడి కన్ను కనిపించదని, ఆ కంటికి శస్త్రచికిత్స జరిగిందని తెలిపారు. అంతేకాదు, ఓ కిడ్నీ విఫలం కావడంతో, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స(Kidney transplant surgery) కూడా జరిగిందని చెప్పారు.
టాలీవుడ్ లో(Tollywood) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి (Rana Daggubati). సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా, ఆ ఛాయలేవీ తన సినిమాలపై పడకుండా, కేవలం ప్రతిభనే నమ్ముకున్నాడు. తాజాగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ (Web series) లో బాబాయి విక్టరీ వెంకటేశ్(Victory Venkatesh) తో కలిసి నటించాడు. ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో రానా ఆసక్తికర అంశాలు (Interesting facts) వెల్లడించాడు. తనకు కుడి కన్ను కనిపించదని, ఆ కంటికి శస్త్రచికిత్స జరిగిందని తెలిపారు. అంతేకాదు, ఓ కిడ్నీ విఫలం కావడంతో, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స (Kidney transplant surgery) కూడా జరిగిందని చెప్పారు. ఆ లెక్కన తాను ఒక టెర్మినేటర్ (Terminator) అని అంటూ చమత్కరించాడు.
ఓసారి ఒక పిల్లవాడు ఓ కన్ను కనిపించడంలేదని తల్లితో చెప్పి ఏడుస్తున్నాడని, దాంతో, నాకు కూడా ఒక కన్ను కనిపించదని చెప్పి ఆ చిన్నారిని ఊరడించానని రానా గుర్తుచేసుకున్నాడు. శారీరక సమస్యలకు సంబంధించి నయం అయినప్పటికీ, తనకు ఎందుకిలా జరుగుతోందని ప్రతి మనిషి ఆలోచించడం సహజమని, కానీ అలాంటి వాటిని పట్టించుకోనవసరంలేదని రానా అన్నారు. తాను ఇప్పుడు ఆనందంగా ఉన్నానని తెలిపారు. కెరీర్ మొదట్నుంచీ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన నటనతో అభిమానులను సొంతం చేసుసుకున్నారు. ఇక ‘బాహుబలి’ (Bahubali)లాంటి సినిమాల్లో నటించి (Pan India Star) గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో నటి సమంత హోస్ట్ గా చేసిన ‘సామ్ జామ్’ (Sam Jam’) కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా రానా తన ఆరోగ్య సమస్యల గురించి తెలిపారు. జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు ఒక్కసారిగా పౌజ్ బటన్ నొక్కితే ఎలా ఉంటుంది, తన లైఫ్ లో కూడా అలాంటి పరిస్థితి వచ్చిందన్నారు.
తనకు చిన్పప్పటి నుంచీ బీపీ (BP) ఉందని, దీంతో గుండె సంబంధిత సమస్య (Heart problem) కూడా వచ్చిందని అన్నారు. ఈ క్రమంలో కొంత వయసు వచ్చిన తర్వాత కిడ్నీలు కూడా పాడయ్యాయని అన్నారు. డాక్టర్లు పరీక్షలు చేసి వీలైనంత త్వరగా వైద్యం చేయించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదమని చెప్పారని చెప్పారు. అయితే మొదట్లో కొన్ని మందులతో ఆ సమస్య తగ్గుతుందేమో అనుకున్నారని, కానీ అది జరగలేదన్నారు. చివరకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. వైద్యం చేయించుకుంటున్న సమయంలో తన కుటుంబాన్ని చూస్తే చాలా బాధగా అనిపించేదని చెప్పారు రానా. తర్వాత కొన్ని నెలలు పాటు వైద్యం చేయించుకొని తిరిగి వచ్చానని రానా (Rana) వెల్లడించారు.