VKB: బొంరాస్పేట మండల వ్యాప్తంగా రైతులు వరి పంట సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ట్రాక్టర్ల ద్వారా దుక్కి దున్ని చదును చేస్తున్న క్రమంలో కొంగలు చిన్నపాటి క్రిమి కీటకాలు పురుగులను తింటూ ఆహార వేటలో నిమగ్నమయ్యాయి. మరోవైపు వేరుశనగ పంట మండల వ్యాప్తంగా కోత దశకు వచ్చింది. రైతు భరోసా కోసం అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.