ADB: ఉట్నూర్ మండలంలోని కుమ్మరికుంట గ్రామాన్ని శనివారం రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్బంగా క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందజేశారు. యువత అధికశాతం క్రీడల్లో ఉంటే విద్యారంగంతో పాటు వివిధ రకాలుగా సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఏఐసీసీ నాయకుడు విష్ణు నాథన్ తదితరులు పాల్గొన్నారు.