కృష్ణా: గన్నవరం RTC బస్టాండ్లో MRP కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఒకటి రెండు రూపాయలు అదనంగా ఉంటే పెద్ద ఇబ్బంది లేదని, కానీ ఐదు రూపాయలకు పైగా వసూలు చేయడం అన్యాయమని వారు వాపోతున్నారు. అధిక ధరల కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.