వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు కొద్దిగా తగ్గాయని సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. WGL జిల్లా కేంద్రంలో నిర్వహించిన వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025లో 1424 ప్రమాదాల్లో 430 మంది మరణించగా, 406 మంది తీవ్రంగా, 1446 మంది స్వల్ప గాయాలపాలయ్యారు. గతేడాది 1468 ప్రమాదాల్లో 459 మరణాలు సంభవించినట్లు CP సన్ ప్రీత్ తెలిపారు.