W.G: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో ఇవాళ భీమవరం ప్రత్యేక ఉపకారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు S. శ్రీదేవి సందర్శించారు. ముద్దాయిలతో ఆయన మాట్లాడారు. బెయిల్ వచ్చి కూడా జామీన్లు సమర్పించని కారణంగా విడుదల కాని ముద్దాయిల వివరాలు నమోదు చేసుకున్నారు. ముద్దాయిల భోజన వసతులను, వైద్య సదుపాయాలను ఆరా తీశారు.