»Dulquer Salmaan Rana Combo Is Ready Kantas Title Look Is Interesting
Kaantha: రానా, దుల్కర్ కాంబో మూవీ టైటిల్ ఫిక్స్
రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కాంత మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇది చూసిన రానా, దుల్కర్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
Dulquer Salmaan-Rana combo is ready.. Kanta's title look is interesting
Kaantha: ప్రస్తుతం సినిమా పరిశ్రమ ఒకే తాటిపై నడుస్తోంది. భాషా బేధం లేకుండా అందరు నటీనటులు కలిసి సినిమాలు చేస్తున్నారు. తాజాగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), తెలుగు స్టార్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) కాంబినేషన్లో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దుల్కర్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ ఖుషీ చేస్తున్నాడు. తాజాగా కొత్త సినిమా వార్త అందించారు.
ఇద్దరు ట్యాలెంటెడ్ హీరోలు నటిస్తున్న ఈ చిత్రానికి కాంత (Kaantha) టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ నెట్టింట్లో సందడి చేస్తోంది. నీల (Nila) ఫేం సెల్వమణి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సెల్వరాజ్ తెరకెక్కించిన డాక్యుమెంటరీ సిరీస్ వీరప్పన్ కోసం వేట(The Hunt for Veerappan) ఆగస్టు 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ఏ జోనర్లో రాబోతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. లేటెస్ట్ టాక్ ప్రకారం దుల్కర్ సల్మాన్ ఇదివరకెన్నడూ కనిపించని సరికొత్ అవతార్‌లో కనిపించబోతున్నాడట. వేఫరెర్ ఫిలిమ్స్, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. ఇక రానా నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వస్తుండడంతో తెలుగు ప్రేక్షకులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.