sharmila on write letter:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కలిసి పోరాటం చేద్దామని అందులో పేర్కొన్నారు. అందరం కలిసి ఢిల్లి వెళ్లి రాష్ట్రపతిని కలుద్దామని అందులో కోరారు. రాష్ట్రంలో అప్రకటిత, అత్యయిక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.
దేశంలో ప్రస్తుతం ఎక్కువ బ్యాంకులు వారానికి (Bank working days) ఐదు నుండి ఆరు రోజులు పని చేస్తున్నాయి. రెండో, నాలుగో శనివారాలు ఉన్న రోజుల్లో ఐదు రోజులు, మిగతా రెండు వారాల్లో ఆరు రోజులు పని చేస్తాయి. అయితే త్వరలో కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే మహిళల క్రికెట్ దశ దిశను మార్చబోతున్న మెగా టోర్నీ. 2023లోనే ఈ టోర్నీ తొలిసారి జరగబోతోంది. ఇప్పటికే మీడియా హక్కులు, ఫ్రాంఛైజీల కోసం వేసిన బిడ్లలో ఈ లీగ్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలో మహిళల ఐపీఎల్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్(WPL) మస్కట్ 'శక్తి'ని బీ...
పెట్టుబడుల (Investments) సమీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of Andhra Pradesh) రేపటి నుండి (మార్చి 3, 4 తేదీలు) విశాఖపట్నం (Visakhapatnam)లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ (Global Investors Summit) నేపథ్యంలో తెలంగాణ (Telangana) మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister) తోటి తెలుగు రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఓ భర్త(husband) తన భార్య(wife)ను 11 ఏళ్లుగా వేధింపులకు గురి చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన ఏపీలోని సత్యసాయి జిల్లా(sathya sai district)లో చోటుచేసుకుంది. న్యాయవాది(lawyer) అయిన మధుబాబు అనే వ్యక్తి అతని తల్లి సహా సోదరుని తప్పుడు మాటలు విని ఆమెను వేధించినట్లు తెలిసింది. ఈ ఘటనపై విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ కెమెరాలకు చిక్కారు. గతంలోనే వీరిద్దరికి రహాస్యంగా పెళ్లయ్యిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ అవి పుకార్లేనని తేలిపోయాయి. తమ ప్రేమ బంధాన్ని వివాహంతో అధికారికంగా జంటగా కాబోతున్నారు. మంచు మనోజ్-మౌనిక జంట త్రిబుల్ ఎం (MMM)గా కానుంది.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి Minister for Tourism, Culture & Youth Advancement) ఆర్కే రోజా (RK Roja) కబడ్డీ (Kabaddi) ఆడారు. మహిళా కబడ్డీ పోటీల్లో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక, సామినేని విమలభాను, విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి కాసేపు కబడ్డీ... కబడ్డీ అంటూ అందరినీ అలరించారు.
అడవికి రారాజైన సింహంన్ని ఏ నీటి ఏనుగు వెనక్కి తరిమింది. తన పరిధిలో సింహం లేకుండా ఎదిరించిన హిప్పోపొటామస్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కులో సినిమా రంగంలో పనిచేసే ఓ నటిపై లైంగిక దాడి యత్నం జరిగింది. ఈ ఘటనపై ఆమె బంజారాహిల్స్ పోలీసులకు తెలిపింది. అయితే రెండేళ్ల క్రితం కూడా తనను ఓ వ్యక్తి వెంబడించి రాయితో బెదిరించి ఫోన్, పర్స్ లాక్కెళ్లాడని వెల్లడించింది.
MLA Gandra: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి మాటతీరు మార్చుకోవాలని హెచ్చరించారు. భూపాలపల్లిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహించిన హాత్ సే హాత్ జోడో యాత్రలో జరిగిన సంఘటనలపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు.
కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావును పోలీసులు హన్మకొండలో హౌస్ అరెస్ట్ చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూకబ్జాలు అవినీతి, అక్రమాలను నిరూపించడానికి ఆధారాలతో సహా రెడీ అయిన నేపథ్యంలో పోలీసులు సత్యనారాయణ ఇంటిని చుట్టుముట్టారు.
తన సోదరి ప్రీతిది ఆత్మహత్య ఏమాత్రం కాదని, హత్యేనని సోదరుడు చెబుతున్నారు. తన సోదరిది హత్య అనేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, ఆత్మహత్య అని చెప్పడానికి వారి వద్ద ఏం ఆధారాలు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
తాము ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం సాగుతోందని, కానీ అలాంటిది ఏమీ లేదని విశాఖ శారదా పీఠం (visakha sarada peetham) ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు.
అమరావతి అయితే తమ పరిస్థితులు మారుతాయని.. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మైలవరం ప్రజలు భావించారు. కానీ దానికి విరుద్ధంగా అమరావతిని నామమాత్రం చేసి విశాఖపట్టణం ప్రధాన రాజధానిగా ఉంటుందని సీఎం జగన్ ప్రకటించడంపై మైలవరం ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.