MLA Gandra: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి మాటతీరు మార్చుకోవాలని హెచ్చరించారు. భూపాలపల్లిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహించిన హాత్ సే హాత్ జోడో యాత్రలో జరిగిన సంఘటనలపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు.
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి మాటతీరు మార్చుకోవాలని హెచ్చరించారు. భూపాలపల్లిలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్వహించిన హాత్ సే హాత్ జోడో యాత్రలో జరిగిన సంఘటనలపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి తమపై చౌకబారు ఆరోపణలు చేసినా చాలా ఓపికతో ఉన్నామని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు నిరాశలో ఉన్నారని చెప్పారు.
మాట్లాడే తీరును రేవంత్ రెడ్డి మార్చుకోవాలని హెచ్చరించారు. నిన్నటి ఘటనలో కాంగ్రెస్ కార్యకర్తలే బీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టారని చెప్పారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే దొంగే దొంగ అని అరిచినట్లు ఉందన్నారు. రేవంత్ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందో.. ఎక్కడి నుండి ఎక్కడకు వచ్చాడో ప్రజలందరికి తెలుసన్నారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సోనియా గాంధీని విమర్శించిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చాడని విమర్శించారు. ముస్లింలకు చెందిన గుట్టలు ఉన్న స్థలాన్ని ఇండస్ట్రీ పెట్టడం కోసం న్యాయబద్ధంగా కొంటే కబ్జా చేశారని రేవంత్ రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నాడని ఎమ్మెల్యే గండ్రా మండిపడ్డారు. ఆ స్థలం కబ్జా చేసినట్లయితే.. జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలి. కానీ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
‘రేపు ఉదయం 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమని..దమ్ముంటే రావాలని..నేను డీజీపీ ఆఫీసుకెళ్లి రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వవద్దని ఫిర్యాదు చేస్తాను’ అని వ్యాఖ్యానించారు. 2023 లోనూ భూపాలపల్లి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.