»The Husband Locked His Wife In The Room For 11 Years Sathya Sai District Andhra Pradesh
Husband Rorture:11 ఏళ్లుగా భార్యను గదిలో బంధించిన భర్త..ఆ కారణంతోనే!
ఓ భర్త(husband) తన భార్య(wife)ను 11 ఏళ్లుగా వేధింపులకు గురి చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన ఏపీలోని సత్యసాయి జిల్లా(sathya sai district)లో చోటుచేసుకుంది. న్యాయవాది(lawyer) అయిన మధుబాబు అనే వ్యక్తి అతని తల్లి సహా సోదరుని తప్పుడు మాటలు విని ఆమెను వేధించినట్లు తెలిసింది. ఈ ఘటనపై విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కలకాలం కష్ట సుఖాల్లో తోడుండాల్సిన భర్త..భార్య(wife)ను అనుమానంతో వేధించసాగాడు(husband torture). అది కూడా ఒక్క రోజు కాదు. గత 11 సంవత్సరాలు(11 years)గా ఆమెను ఇబ్బందులకు గురిచేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఏపీ(ap)లోని సత్యసాయి జిల్లా(sathya sai district)లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే విజయవాడలోని ముధబాబు లాయర్ వృత్తిని కొనసాగిస్తున్నాడు. అతనికి పుట్టపర్తికి చెందిన జనార్థన్, హేమలతల కుమార్తె సాయి సుప్రియకు 2008లో పెళ్లి జరిగింది. ఆ క్రమంలో సుప్రియకు 2009లో పాప పుట్టిన తర్వాత వారి అమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి మళ్లీ అత్తారింటికి తిరిగి వచ్చింది.
ఆ క్రమంలో విజయవాడ పరిధిలో ఉంటున్న వీరికి.. ముధబాబు తల్లి ఉమామహేశ్వరి, తన తమ్ముడు మాటలతో భార్యను తిట్టడం మొదలుపెట్టాడని తెలిసింది. ఆ క్రమంలో భార్య(wife)ను వేధించడం, ఆమెను బయటకు వెళ్లనీయకుండా చేసేవాడు. అంతేకాదు తన కుటుంబ సభ్యుల(family)తో కూడా మాట్లడనిచ్చేవాడు కాదు. అదే నేపథ్యంలో ఆమెను ఏకంగా ఓ చీకటి గదిలో బంధించాడు. అలా దాదాపు 11 ఏళ్ల పాటు అలాగే చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమె తల్లిదండ్రులు(parents) తన కుమార్తె గురించి అడుగగా..తాను లాయర్(lawyer) అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది.
ఆ తర్వాత ఆమెకు ఇద్దరు కుమారులు(sons) పుట్టిన విషయం కూడా ఆమె పేరెంట్స్(parents)కు తెలియనీయ లేదు. ఆమెను చూసేందుకు వారి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులను కూడా చూడనీయలేదు. దీంతో వారు తమ అల్లుడి తీరుపై జిల్లా ఎస్పీ(SP) హేమలతకి ఫిబ్రవరి 27న ఫిర్యాదు(compliant)చేశారు. ఎస్పీ(sp) ఆదేశాల మేరకు అధికారులు మధుబాబు ఇంటికి వెళ్లారు. ఆ క్రమంలో పోలీసులు(police) తమ ఇంటికి రావడానికి ఆదేశాలు ఏవని, తమ ఇంటిని తనిఖీ చేసే అధికారం మీకు లేదని, కోర్టు(court) ఆదేశాలు ఉన్నాయా అంటూ మధుసుధన్ హల్ చల్ చేశాడు. దీంతో వారు వెనక్కి తిరిగి వెళ్లి పోయారు.
దీంతో పోలీసులు ఎస్పీ హేమలత ఇచ్చిన కంప్లైంట్(compliant) ఆధారంగా కోర్టు(court)ను ఆశ్రయించారు. ఆ క్రమంలో సెర్చ్ వారెంట్ ఇవ్వడంతో సీఐ, ఎస్సై సహా పలువురు పోలీసులు వెళ్లి వారి ఇంటి లోపలికి బలవంతంగా వెళ్లారు. అప్పుడు ఓ చికటి గదిలో ఉన్న ఆ మహిళను తీసుకొచ్చి న్యాయస్థానంలో హజరుపరిచారు. ఈ క్రమంలో అతనితోపాటు వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు(police) వెల్లడించారు.