»Minister Rk Roja Plays Kabaddi In Ntr Krishna District
Minister RK Roja: అరుపులు, కేకల మధ్య… కబడ్డి ఆడిన మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి Minister for Tourism, Culture & Youth Advancement) ఆర్కే రోజా (RK Roja) కబడ్డీ (Kabaddi) ఆడారు. మహిళా కబడ్డీ పోటీల్లో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక, సామినేని విమలభాను, విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి కాసేపు కబడ్డీ... కబడ్డీ అంటూ అందరినీ అలరించారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి Minister for Tourism, Culture & Youth Advancement) ఆర్కే రోజా (RK Roja) కబడ్డీ (Kabaddi) ఆడారు. మహిళా కబడ్డీ పోటీల్లో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక, సామినేని విమలభాను, విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి కాసేపు కబడ్డీ… కబడ్డీ అంటూ అందరినీ అలరించారు. పోటీలో విజేతలకు బహుమతులను అందించారు. విజేత జట్లు.. మొదటి బహుమతి రూ. 1 లక్ష రెండో బహుమతి , రూ. 75 వేలు, తృతీయ బహుమతి రూ.50 వేలు, నాలుగో బహుమతి రూ.25 వేల పారితోషకాన్ని అందించారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో SVM ప్రసాద్ స్మారక మహిళా కబడ్డీ పోటీల ముగింపునకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆమె. ఈ సమయంలో కాసేపు అందరితో కలిసి కబడ్డీ ఆడి సరదాగా గడిపారు. రోజా ఆడుతుండగా అభిమానులు, అక్కడకు వచ్చిన వారు ఆనందంతో పెద్ద ఎత్తున కేకలు వేశారు. ఆమెను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. చాలామంది తమ తమ సెల్ ఫోన్ లలో వీడియోలు తీసారు.
అనంతరం ఆమె మాట్లాడారు. తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. మొదటిసారి ఓ పెళ్లికి వచ్చానని, ఇప్పుడు రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలకు రావడం ఆనందంగా ఉందన్నారు. మహిళలు అంటే వంటింటి కుందేళ్లు కాదని, అవకాశం ఇస్తే.. వెన్నుతడితే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. ఈ రోజు అన్ని రంగాల్లో మహిళలు దూసుకు పోతున్నారని చెప్పారు. అలాంటి మహిళల కోసం ఇక్కడ కబడ్డీ పోటీలు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఆడపిల్లలు ఎలా పోటీ పడ్డారో ఇక్కడ చూశామని.. వారు ఆడపులిలా కనిపించారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయబాను, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, జెడ్పీ చైర్మ పర్సన్ ఉప్పాల హారిక, కాపు కార్పోరేషన్ చైర్మన్ శేషు తదితరులు పాల్గొన్నారు.