Manchu Manoj రేపే మనోజ్ పెళ్లి.. మంచు వారి ఇంట్లో సందడి
ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ కెమెరాలకు చిక్కారు. గతంలోనే వీరిద్దరికి రహాస్యంగా పెళ్లయ్యిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ అవి పుకార్లేనని తేలిపోయాయి. తమ ప్రేమ బంధాన్ని వివాహంతో అధికారికంగా జంటగా కాబోతున్నారు. మంచు మనోజ్-మౌనిక జంట త్రిబుల్ ఎం (MMM)గా కానుంది.
ఎప్పటి నుంచో యువ నటుడు మంచు మనోజ్(Manchu Manoj) పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వస్తున్న వార్తలు నిజమయ్యాయి. మార్చి 4వ తేదీన శుక్రవారం మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. అందరూ ఊహించినట్టే ప్రముఖ రాజకీయ కుటుంబం భూమ (Bhuma Family) వారసురాలినే మనువాడబోతున్నాడు. మనోజ్ పెళ్లి సందర్భంగా మంచు వారి ఇంట (Manchu Family) సందడి నెలకొంది. ముఖ్యంగా మంచు లక్ష్మి నివాసంలో ఉత్సాహ వాతావరణం అలుముకుంది. సంగీత్, పసుపు స్నానాల వేడుక ఆనందోత్సాహాల మధ్య జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.
ఇటీవల తన కొత్త సినిమా (New Movie)ను మనోజ్ ప్రారంభించాడు. ఆ సినిమా ప్రారంభం సందర్భంగా మనోజ్ చేసిన ట్వీట్ అందరినీ ఆసక్తి గొలిపింది. జీవితంలో మరో స్టెప్ తీసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ఆ అడుగు పెళ్లి అని అందరూ అనుకున్నారు. కానీ అది సినిమా ప్రారంభోత్సవం అని తేలడంతో ప్రేక్షకులు, మంచు అభిమానులు ఊసురు మన్నారు. వాట్ ది ఫిష్ (What the fish) అనే సినిమా మనోజ్ చేస్తున్నాడు. అయితే అతడి పెళ్లి మాత్రం పక్కా అని మాత్రం చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం అతడు భూమ మౌనిక మెడలో తాళి కట్టబోతున్నాడు. భూమా నాగిరెడ్డి-శోభ దంపతుల చిన్న కుమార్తె మౌనిక (Bhuma Mounika).
ఇక తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న భూమ మౌనికతో మనోజ్ ఏడడుగులు వేయనున్నాడు. పెళ్లికి ముందు జరిగే పూజా కార్యక్రమాలు మంచు వారి ఇంట్లో జరుగుతున్నాయి. మోహన్ బాబు కుటుంబసభ్యులతో పాటు బంధువులతో మంచు వారి ఇల్లు కళకళలాడుతోంది. బుధవారం మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం సంగీత్ కార్యక్రమం జోరుగా సాగింది. మంచు విష్ణు, లక్ష్మితో పాటు ఇతర సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా పాల్గొన్నట్లు సమాచారం. అయితే వీరి పెళ్లి కొద్ది మంది అతిథులు, బంధుమిత్రులు మాత్రమే హాజరవుతున్నట్లు తెలుస్తున్నది. పెళ్లి తిరుపతిలో జరుగుతుందని సమాచారం.
మనోజ్ కు 2015 సంవత్సరంలో ప్రణతి (Pranathi) అనే అమ్మాయితో వివాహమైంది. వారి మధ్య విబేధాలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్నాడు. కాగా మౌనికకు కూడా గతంలో వివాహమైంది. ఆమె కూడా భర్తకు దూరంగా ఉంటోంది. అయితే మనోజ్, మౌనికకు చాలా ఏళ్ల నుంచే పరిచయం ఉంది. వీరిద్దరూ స్నేహితులు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో చాలాసార్లు వీరిద్దరి కలిసి కనిపించారు. ఆలయాలకు వెళ్లారు. ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ కెమెరాలకు చిక్కారు. గతంలోనే వీరిద్దరికి రహాస్యంగా పెళ్లయ్యిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ అవి పుకార్లేనని తేలిపోయాయి. తమ ప్రేమ బంధాన్ని వివాహంతో అధికారికంగా జంటగా కాబోతున్నారు. మంచు మనోజ్-మౌనిక జంట త్రిబుల్ ఎం (MMM)గా కానుంది.