BDK: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యావత్ భారతదేశం మొత్తంలో ఉన్న బంజారా ప్రజలను ఏకం చేసి సన్మార్గాన్ని చూపించిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు.
MDCL: ఉప్పల్ మీడియా క్లబ్ నూతన కమిటీని మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తన నివాసంలో సత్కరించారు. సీనియర్ జర్నలిస్టు వడ్డేపల్లి కిషోర్ నేతృత్వంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఐక్యంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కమిటీ సేవా కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని, అవసరమైన సదుపాయాల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ATP: మార్చి 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే, ఫిబ్రవరి 28న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు అనంతపురం కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి నగదు అందజేస్తారని పేర్కొన్నారు. జిల్లాలో 2,77,073 మందికి రూ.123.99 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.
SRPT: హుజూర్నగర్ పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన జక్కుల మల్లయ్య, మోదాల కామేశ్వరి, కోడి జ్యోతి, కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన సుంకరి శివరామ్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి, యాదవ సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేయాలని తెలిపారు.
MDK: మనోహరాబాద్ మండలం రామాయపల్లి ఇండస్ మెడికేర్ కంపెనీలో ‘Arrive అండ్ Alive’ 2వ దశ కార్యక్రమం నిర్వహించారు. తూప్రాన్ సీఐ రంగాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు.
W.G. ఉండి, పాలకోడేరు ఎంపీడీవో కార్యాలయాలను కలెక్టర్ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూ.ఎఫ్.ఎస్ సర్వే, ఈ-కేవైసీ, పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. సర్వే ప్రక్రియ మందకొడిగా సాగడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.
PDPL: సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. GDK తిలక్ నగర్ ఆఫీస్‌లో గురువారం సింగరేణి పరిరక్షణ- కార్మిక హక్కులపై సమావేశం నిర్వహించారు. రియాజ్ అహ్మద్, రాజన్న, విశ్వనాథ్ మాట్లాడుతూ.. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు.
నెల్లూరు: ఇబ్రహీంపట్నం సమీపంలోని కొండపల్లి ప్రాంతంలో ఉన్న కొండపల్లి ఎన్విరొ టెక్ CETP ప్లాంట్‌ను రాష్ట్ర ఎన్విరాల్‌మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పరిశీలించారు. ప్లాంట్లో జరుగుతున్న కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల నుండి వస్తున్న వ్యర్థ జలాల శుద్ధి ప్రక్రియ నిర్వహణ విధానంపై ఆరా తీశారు.
ఉమ్మడి ప.గో.జిల్లాలో పాలు, పాల పదార్థాల కల్తీ యదేచ్ఛగా కొనసాగుతుందని ఆర్టీసీ జోన్ 2 ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఇటీవలే రాజమండ్రిలో కల్తీ పాలు పలువురి ప్రాణాలు తీసిన నేపథ్యంలో ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అధికారులు నిర్లక్ష్య వైఖరి మూలంగానే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కల్తీ పాలను తయారు చేస్తున్నారన్నారు.
AP: ప్రతి ఎకరాకు నీరందించాలన్న సీఎం చంద్రబాబు సంకల్పం త్వరలో సాకారం అవుతుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సాగునీటి రంగంపై అసెంబ్లీలో చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం సాగునీటి రంగానికి రూ. 52,724 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. 20 నెలల్లో రూ. 25,948 కోట్లు ఖర్చు చేసి పురోగతికి బాటలు వేసిందని కొనియాడారు.
వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా అద్భుత విజయాన్ని సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. మార్‌క్రమ్(82*) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డికాక్(47), రికల్టన్(49*) రాణించారు. ఈ విజయంతో SA దాదాపుగా సెమీస్‌కు అర్హత సాధించింది. దీంతో భారత్ తన చివరి 2 మ్యాచ్‌ల్లో గెలిస్తే.. ఏ జట్టుతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ చేరుకుంటుంది.
వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా అద్భుత విజయాన్ని సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. మార్‌క్రమ్(82*) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డికాక్(47), రికెల్టన్(49*) రాణించారు. ఈ విజయంతో SA దాదాపుగా సెమీస్‌కు అర్హత సాధించింది. దీంతో భారత్ తన చివరి 2 మ్యాచ్‌ల్లో గెలిస్తే.. ఏ జట్టుతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ చేరుకుంటుంది.
SKLM: గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల విద్యార్థినులకు అవగాహన అవసరమని శక్తి టీం హెచ్‌సీ ఎం గిరిధర్ తెలిపారు. గురువారం పాతపట్నం మండలం పెద్దలోగిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలతో అవగాహన సదస్సు నిర్వహించారు. నేడు పలు ప్రాంతాలలో బాలికలపై ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని ముందుగా గుర్తించేందుకు అవగాహన పరుచుకోవాలని ఆయన సూచించారు.
KDP: రాజంపేట మున్సిపాలిటీలో తాగునీటి నాణ్యతపై మున్సిపల్ కమిషనర్ లక్ష్మీనారాయణ అకస్మాత్ తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని పలు నీటి సరఫరా కేంద్రాలను పరిశీలించిన కమిషనర్, నీరు ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. వేసవికాలంలో నీటి కొరత లేదా నాణ్యత సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ASR: జీకేవీధి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్య చేసిన కేసులో నిందితుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.50వేల జరిమానా విధించినట్లు ఎస్పీ అమిత్ బర్దార్ గురువారం తెలిపారు. ఈ కేసులో పాంగి రమేష్ అలియాస్ పోయి రమేష్‌ను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారన్నారు. పోక్సో ప్రత్యేక కోర్టు నిందితుడికి శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.