• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లా చేస్తానని చెప్పా.. మాట నిలబెట్టుకున్నా: CM

AP: మార్కాపురం జిల్లా దోర్నాలలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ దగ్గర.. రూ.456 కోట్లతో ఆధునీకరించిన ఫీడర్ కెనాల్‌ను ప్రారంభించారు. అనంతరం సీఎం ఫీడర్ కెనాల్ వెంట నడుచుకుంటూ రైతులతో మాట్లాడారు. ‘మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పా.. మాట నిలబెట్టుకున్నా. మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలు చేశాను’ అని పేర్కొన్నారు.

February 25, 2026 / 04:24 PM IST

దుప్పిని ఖననం చేసిన ఫారెస్టు అధికారులు

కడప-కర్నూలు జాతీయ రహదారిలోని చెన్నముక్కపల్లె వద్ద కారు ఢీకొని మృతి చెందిన దుప్పిని డీఎఫ్‌వో ఆదేశాల మేరకు ఎల్బీవో శాంతి మంగళవారం ఖననం చేశారు. పశువైద్య అధికారి ఎం.లక్షుమయ్య మరణించిన దుప్పికి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఖననం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్వాచర్ నవీన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:23 PM IST

భక్తుల మనోభావాలను గౌరవిస్తాం: కేంద్ర మంత్రి

BDK: మణుగూరులోని చారిత్రాత్మక శ్రీ కాళీమాత ఆలయ తరలింపు మరియు పునఃప్రతిష్ఠా పనులపై కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి బుధవారం సానుకూలంగా స్పందించారు. BTPS రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా 55 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం తొలగింపుకు గురవుతున్న నేపథ్యంలో, ఆలయ కమిటీ విన్నపాన్ని పరిశీలించి ఆలయ తరలింపుకు అయ్యే ఖర్చులు నిబంధనల ప్రకారం అందిస్తామని సూచించారు.

February 25, 2026 / 04:22 PM IST

తిరుమల శ్రీవారి వస్త్రాలు ఈ-వేలం

TPT: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన పవిత్ర వస్త్రాలను టీటీడీ మార్చి 02 నుంచి ఆన్‌లైన్‌లో ఈ-వేలం వేయనుంది. ఈ వేలం మార్చి 09 వరకు కొనసాగుతుంది. వివిధ రకాల వస్త్రాల 287 లాట్లను కొనుగోలు చేయడానికి భక్తులు https://konugolu .ap.gov.in వెబ్సైట్ ద్వారా పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు టీటీడీ కార్యాలయంలో సంప్రదించవచ్చు.

February 25, 2026 / 04:22 PM IST

ఉచిత మెగా వైద్య శిబిరం

SDPT: కోహెడ మండలంలోని తంగళ్లపల్లిలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని సర్పంచ్ బోయిని సంపత్ తెలిపారు. 250 మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేసి దాదాపు రూ.20 వేల విలువైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. డా. జయంత్, డా. సాయి శ్రీ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయి. అనంతరం హాస్పిటల్ యాజమాన్యాన్ని సన్మానించారు.

February 25, 2026 / 04:21 PM IST

ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న కొత్వాల దంపతులు

BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 9వ డివిజన్ గుడిపాడు లో నూతనంగా పునర్నిర్మాణం జరిగిన శ్రీదేవి, గోదాదేవి సమేత శ్రీ మోక్ష వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవ 5వ రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. బుధవారం డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు.

February 25, 2026 / 04:21 PM IST

విడవలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐఎస్ఓ సర్టిఫికెట్

నెల్లూరు: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు విద్యా ప్రామాణికతలు పాటించినందుకు ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను అధికారులు బుధవారం అందజేశారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు అందిస్తున్న విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ సర్టిఫికెట్‌ను అందించారు. దీంతో కళాశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

February 25, 2026 / 04:21 PM IST

ఎమ్మెల్సీ దృష్టికి గ్రామ సమస్యలు

MDK: చేగుంట మండలం పోలంపల్లి సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను బుధవారం కలిశారు. పోలంపల్లి గ్రామ సమస్యలను ఎమ్మెల్సీ కోదండరాం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. గ్రామ సమస్యలపై ఎమ్మెల్సీ కోదండరాం సానుకూలంగా స్పందించి గ్రామాభివృద్ధికి నిధులు అందజేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వార్డు సభ్యులు చింతకాయల ప్రవీణ్ పాల్గొన్నారు.

February 25, 2026 / 04:20 PM IST

జగన్ నిర్వాసితులకు రూపాయి కూడా ఇవ్వలేదు: నిమ్మల

ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.900 కోట్లు ఇవ్వాల్సి ఉండగా వైయస్ జగన్ ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసం, దగా చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఆనాడు 2019 ముందు చంద్రబాబు నిర్మాణాలు చేసినవి తప్ప జగన్ ఎలాంటి చేయలేదని, భవిష్యత్తులో ఎవరు మంచి చేస్తారో వారినే ఆదరించాలని పిలుపునిచ్చారు.

February 25, 2026 / 04:20 PM IST

‘జాంబీరెడ్డి 2’పై క్రేజీ న్యూస్..!

యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘జాంబీరెడ్డి’ మూవీకి సీక్వెల్‌గా ‘జాంబీరెడ్డి 2’ రాబోతుంది. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ కథను అందించాడట. ఫస్ట్ పార్ట్ కంటే ఈ మూవీ అంతకుమించి వైల్డ్‌గా ఉంటుందట. VFX విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. జాంబీలతో పోరాడే సన్నివేశాలు ఈసారి మరింత డెడ్లీగా ఉంటాయని టాక్.

February 25, 2026 / 04:20 PM IST

రేపటి నుంచి రెవెన్యూ క్లినిక్

PPM: జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి గ్రామస్థాయిలో ‘రెవెన్యూ క్లినిక్స్’ ప్రారంభం కావాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయములో రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇకపై ప్రతి గురువారం వీఆర్వోలు ఆయా గ్రామాల్లో రెవిన్యూ క్లినిక్లు నిర్వహించాలన్నారు.

February 25, 2026 / 04:19 PM IST

వామపక్షల రౌండ్ టేబుల్ సమావేశం

VSP: ఆంధ్రా యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు మత వైషమ్యాలకు దారితీస్తున్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం విశాఖలో పలు ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థలను మత రాజకీయాలకు వేదికగా మార్చొద్దని, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

February 25, 2026 / 04:19 PM IST

గురుకులాల్లో సమస్యలను పరిష్కరించాలని వినతి

MHBD: గురుకులాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని గురుకులాల సెక్రటరీ సీతాలక్ష్మికి DSFI నేతలు వినతిపత్రం అందజేశారు. DSFI రాష్ట్ర కార్యదర్శి సాయికుమార్, కోశాధికారి గుగులోతు సూర్య ప్రకాష్‌లు మాట్లాడుతూ.. గురుకులాల్లో సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలన్నారు.

February 25, 2026 / 04:19 PM IST

ఏఐ టెక్నాలజీ క్లినిక్‌ను ప్రారంభించిన సినీనటి

విజయనగరంలో ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద బుధవారం మొట్ట మొదటి ఏఐ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఓ క్లినిక్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీనటి కామ్నా జెట్మిలాని, డీఎస్పీ గోవిందరావు విచ్చేశారు. ఈ సందర్భంగా MAC చైర్ పర్సన్ అండ్ ఫౌండర్ డా. శ్రీవల్లి కొర్రపాటి మాట్లాడుతూ.. అందరికీ అందుబాటు ధరల్లోనే మా సర్వీసులు ఉంటాయన్నారు.

February 25, 2026 / 04:18 PM IST

కొనసాగుతున్న అంగన్వాడీల రిలే దీక్షలు

ELR: సమస్యల పరిష్కారం కోరుతూ.. అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడో రోజు కొనసాగాయి. వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు దీక్ష చేశారు. సీపీఐ మండల కార్యదర్శి బాడిశ రాము, ఏఐటీయూసీ జిల్లా నాయకులు కారం. దారయ్య అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 04:18 PM IST