• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఈనెల 7న కార్గో సామాగ్రి వేలం

RR: కార్గోలో వచ్చిన పార్సిల్ సామగ్రిని ఈనెల 7న మధ్యాహ్నం 12 గంటలకు ఇబ్రహీంపట్నం బస్టాండ్‌లో వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ సుజాత తెలిపారు. కార్గో బస్సుల్లో రవాణా చేసిన పలు పార్సిళ్లను సంబంధిత వ్యక్తులు కొన్నాళ్లుగా తీసుకెళ్లడం లేదన్నారు. ఈ సామగ్రిని వేలం వేయనున్నామని, ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు.

March 4, 2026 / 09:31 AM IST

మట్టితో హోలీ సంబరాలు.!

VKB: మర్పల్లి మండలంలోని పంచలింగాల, సిరిపురం, తుమ్మలపల్లి గ్రామాల్లో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. యువకులు, మహిళలు రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. కాగా పంచలింగాల యువకులు రసాయన రంగులకు దూరంగా ఉండి, కేవలం మట్టితో హోలీ జరుపుకోవడం విశేషం. పర్యావరణాన్ని కాపాడుతూ, ఆరోగ్యానికి హాని కలగకుండా సాగిన ఈ మట్టి హోలీ అందరినీ ఆకర్షించింది.

March 4, 2026 / 09:29 AM IST

నేటి నుంచి గుంజేడు ముసలమ్మ జాతర

MHBD: కొత్తగూడ మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన గుంజేడు ముసలమ్మ అమ్మవారి మహాజాతర బుధవారం నుంచి 6 తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే ఈ జాతర కోసం దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

March 4, 2026 / 09:28 AM IST

పెరిగిన నిమ్మకాయల ధరలు.. ఎంతంటే..?

TPT: ఎండలు భగ్గుమన్న వేళ నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ భారీగా పెరగడంతో మన ప్రాంత నిమ్మకాయలకు మంచి మార్కెట్ దక్కుతోంది. ప్రస్తుతం కిలో నిమ్మకాయలు వంద వరకు పలుకుతుండటంతో బాలాయపల్లె రైతులకు లాభాలు చేకూరుతున్నాయి. ఎండల తీవ్రత పెరగడం, నిమ్మరసం వినియోగం అధికమవడం వల్లే ఈ ధరల పెరుగుదల చోటుచేసుకుందని వ్యాపారులు చెబుతున్నారు.

March 4, 2026 / 09:28 AM IST

జగన్ కంటే ఎక్కువ ఇస్తామని ఆశ పెట్టారు: బుగ్గన

NDL: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ అయ్యారు. ‘కృతజ్ఞతకు, ఆశకు పోటీ పెడితే ఆశే గెలుస్తుంది. ఆ ఆశను కూటమి సృష్టించింది. ఆ ఆశతోనే ప్రజలు మోసపోయారు. చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోవడం ఇది మొదటిసారి కాదు. నాలుగోసారి. జగన్ చేస్తున్న సంక్షేమం అంతా అనవసరమైనదని ప్రచారం చేసి, ఎన్నికల సమయంలో జగన్ కంటే ఎక్కువ ఇస్తామని ఆశ’ పెట్టారన్నారు.

March 4, 2026 / 09:26 AM IST

చెరువులో ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు

GDWL: షాద్‌నగర్ పరిధిలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ వసతి గృహ విద్యార్థి రాజు చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. హోలీ సందర్భంగా స్నానానికి వెళ్లిన అతను తిరిగి రాలేదు. మృతుడు గద్వాల జిల్లా అయిజ మండలం కొత్తపల్లికి చెందినవాడిగా గుర్తించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. కుమారుడు క్షేమంగా రావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

March 4, 2026 / 09:25 AM IST

‘వన్యప్రాణులను కాపాడితేనే, ప్రకృతి సమతుల్యంగా నిలుస్తుంది’

MHBD: వన్యప్రాణులను కాపాడితేనే, ప్రకృతి సమతుల్యంగా నిలుస్తుందని కొత్తగూడ FRO వజహాత్ అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని రేంజ్ పరిధిలోని కార్లాయి, బత్తులపల్లి సెక్షన్ అధికారుల ఆధ్వర్యంలో పోలరం కస్తూర్బా పాఠశాలలో అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలను నిర్వహించారు.

March 4, 2026 / 09:23 AM IST

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26, 2026న విడుదల కానుంది. మార్చి 22న ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత భారీగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ప్రమోషన్స్ కోసం పవన్ స్వయంగా రెండు రోజులు కేటాయించారనే వార్త సినిమాపై హైప్ అమాంతం పెరిగింది. పవర్ స్టార్ ప్రచార బరిలోకి దిగడం మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

March 4, 2026 / 09:23 AM IST

నేడు కృష్ణంపల్లెలో ఉరుసు ఉత్సవాలు

NDL: చాగలమర్రి మండలం కృష్ణంపల్లెలో వెలసిన ప్రసిద్ధ జమల్ వలి స్వామి ఉరుసు ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభించనున్నట్లు దర్గా నిర్వాహకులు వెన్నపూస పుల్లారెడ్డి తెలిపారు. బుధవారం ఉరుసు కార్యక్రమం వైభవంగా జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక ప్రార్థనలు పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

March 4, 2026 / 09:22 AM IST

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ప్రయాణికుడు..!

JN: జగద్గిరిగుట్ట నుంచి జనగామ డిపోకు చెందిన RTC బస్సులో ప్రయాణించిన ఓ కుటుంబం స్టేషన్ ఘనపూర్‌లో దిగుతూ పర్స్ మరిచిపోయింది. అందులో మొబైల్ ఫోన్, తులం బంగారం, రూ.400 నగదు, ఆధార్ కార్డులు ఉన్నాయి. ప్యాసింజర్ అనంత రెడ్డి గుర్తించి ఆ పర్స్‌ను కండక్టర్ కుమార్, డ్రైవర్ రాములుకు అప్పగించారు. వారు యథావిధిగా బాధితులకు ఇచ్చారు.

March 4, 2026 / 09:21 AM IST

డయేరియా ఎఫెక్ట్.. ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

శ్రీకాకుళం పట్టణంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. డయేరియా నియంత్రణలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. పట్టణంలో 50 డివిజన్లు పరిధిలో పారిశుద్ధ్యం పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులను జాయింట్ కలెక్టర్, ఇంఛార్జ్ మున్సిపల్ కమిషనర్ పర్మాన్ అహ్మద్ ఖాన్ పర్యవేక్షిస్తున్నారు. ఇంటింటి చెత్త సేకరణ కొనసాగిస్తున్నారు.

March 4, 2026 / 09:21 AM IST

అసంపూర్తిగా 342వ జాతీయ రహదారి పనులు

సత్యసాయి: ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి మీదుగా కోడూరు వరకు సాగుతున్న 342వ జాతీయ రహదారి నిర్మాణం అసంపూర్తిగానే మిగిలింది. పాత ఆర్ఎంపీ రోడ్డును జాతీయ రహదారిగా మార్చినప్పటికీ ఆ స్థాయి సౌకర్యాలు కనిపించడం లేదు. నిధులున్నా భూసేకరణలో ఆలస్యం, రైతులకు పరిహారం అందకపోవడంతో పనులు నిలిచిపోయాయి. త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

March 4, 2026 / 09:21 AM IST

లబ్ధిదారులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే బొలిశెట్టి

W.G: టిడ్కో లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలం ఎల్. అగ్రహారం టిడ్కో గృహ సముదాయాన్ని ఆయన పరిశీలించారు. పై అంతస్తులకు వెళ్లలేని వారికి లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే శ్రీవారి ఆలయం, త్వరలో వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు.

March 4, 2026 / 09:19 AM IST

బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో ప్రత్యేక శిక్షణ

SRCL: తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో ఈనెల 5న ముత్యపు చిప్ప, పాల పుట్టగొడుగుల పెంపకం నిర్వహణపై ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నట్లు అసోసియేట్ డీన్ డా. కె.బి. సునీతాదేవి తెలిపారు. రూ.500 ఫీజుతో శిక్షణలో పాల్గొనవచ్చని, సర్టిఫికెట్ అందజేస్తామని చెప్పారు. వివరాలకు 8008738267ను సంప్రదించాలని సూచించారు.

March 4, 2026 / 09:19 AM IST

కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఇంటర్ పరీక్షలు

SRD: జిన్నారం మున్సిపల్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు ఆరవ రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 146 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయాన్నే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో విద్యార్థులతో సందడి వాతావరణం నెలకొంది.

March 4, 2026 / 09:19 AM IST