హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,110 తగ్గి రూ.1,64,510కు చేరగా, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.2,850 తగ్గి రూ.1,50,800గా నమోదైంది. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.20,000 తగ్గి రూ.2,95,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఆస్ట్రేలియాతో ఈ నెల 6 నుంచి జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు భారత స్టార్ బౌలర్ రేణుకా సింగ్ దూరమైంది. గత కొంతకాలంగా వరుసగా మ్యాచ్‌లాడుతున్న ఆమెకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఈ మేరకు ఆమె స్థానంలో యువ పేసర్ కశ్వీ గౌతమ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్ పెర్త్ వేదికగా భారత కాలమానం ప్రకారం ఉ.10-50 గంటలకు ప్రారంభమవుతుంది.
E.G: రాష్ట్ర వైసీపీ CEC మెంబర్‌గా రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావును నియమించారు. ఈ సందర్భంగా ఆయన, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్‌తో కలిసి బుధవారం తాడేపల్లి పార్టీ కార్యాలయం నందు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతం రామ్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఇవాళ వైభవంగా హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ హోలీ వేడుకల్లో మున్సిపల్ ఛైర్మన్ మున్సిపల్ పాలకవర్గం హుస్నాబాద్ పట్టణ ప్రజలకు పాల్గొని వైభవంగా ఈ వేడుకలు నిర్వహించారు. ప్రజలంతా సంతోషంగా ఈ వేడుకల్లో పాల్గొని రంగులు పూసుకుని డీజే పాటలతో ఆడి పాడారు.
JGL: ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, మెదక్ నిజామాబాద్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి చిన్నమలైని హైదరాబాదులోని వారి నివాసంలో మల్లాపూర్ బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. అలాగే మండలంలోని పలువురి సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులను ఆయనకు అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందించారు.
VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని నస్కల్ గ్రామంలో భూ తగాదా విషయంలో దాయాదులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సర్వే నంబర్ 216లో గల భూమిలో దారి విషయంలో గొడవకు దిగారు. దీంతో రెండు వర్గాలలో ఓ వర్గానికి చెందిన శ్రీనివాస్, దీపక్, వెంకటేశ్ తలలకు గాయాలయ్యాయి. మరో వర్గానికి స్వల్పంగా దెబ్బలు తగిలాయి. దాయాదులు ఇరువురు పరిగి PSలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.
MNCL: దళారుల ద్వారా చిన్నారులను కొనుగోలు చేయరాదని మంచిర్యాల జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి రవూఫ్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నారులను అక్రమంగా దత్తత తీసుకోవడం చట్టప్రకారం నేరమన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధానాల ద్వారా చిన్నారులను దత్తత తీసుకోవచ్చని, పిల్లలులేని దంపతులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వనపర్తి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైకును ఢీకొట్టిన ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ హెమంత్ (19) అనే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు NGKL జిల్లాకు చెందిన వాడిగా గుర్తింపు. సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TPT: భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం కల్పించారు. రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.
GNTR: పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. జయభరత్ నగర్‌లో CC రోడ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకురాగా, ఆయన స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. తక్షణమే రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ జోరుతో భారత రూపాయి విలువ చారిత్రక కనిష్టానికి పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే రూపాయి విలువ ఏకంగా 67 పైసలు క్షీణించి, డాలర్‌తో పోలిస్తే 92.17 వద్ద ముగిసింది. ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఈ పతనానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. రూపాయి బలహీనపడటంతో దిగుమతులపై భారం పెరిగి, నిత్యావసర ధరలు పెరిగే అవకాశం ఉంది.
ICC ఈవెంట్స్‌లో అత్యధికంగా 20* సార్లు సెమీస్ ఆడిన జట్టుగా భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో రేపు ఆడేది భారత్‌కు T20 WCలో ఆరో సెమీస్ కాగా.. ODI WCలో 8 సార్లు తలపడింది. అటు ఛాంపియన్స్ ట్రోఫీలో 5, WTCలో 2 సార్లు క్వాలిఫై(ఫైనలిస్ట్) అయింది. ఇక ఆస్ట్రేలియా(18)-న్యూజిలాండ్(18*), ఇంగ్లండ్(16*)-పాక్(16), సౌతాఫ్రికా(15*) తర్వాతి 3 స్థానాల్లో ఉన్నాయి.
VSP: ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అన్ని న్యాయ స్థానాలలో ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాదికార సంస్థ మంగళవారం ప్రకటనలో తెలిపింది. లోక్ అదాలత్లో న్యాయస్థానాల్లో పెండింగ్ ఉన్న సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహారాలు పరిష్కరించుకోవచ్చని సూచించింది.
KMM: మధిర మున్సిపల్ ఛైర్‌పర్సన్ సామినేని సుజాత బుధవారం 10వ వార్డులోని ట్యాంక్ బండ్ పనులను పరిశీలించారు. పిల్లల ఆట పరికరాల మరమ్మతులు, వాకింగ్ ట్రాక్ శుభ్రత, టాయిలెట్లకు నీటి సౌకర్యం వంటి పనులను పర్యవేక్షించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కమిషనర్ సంపత్ కుమార్‌ను ఆదేశించారు. ఆట స్థలంలో ఇసుక పోయించి సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
ADB: పండుగ పూట ఓ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉట్నూర్ మండలం హస్నాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సునీల్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లో పనిచేస్తూ, నిండు గర్భిణి అయిన భార్యతో పండుగ జరుపుకునేందుకు జైనూర్ మండలం సొన్ పటేల్ గూడా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.