• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రూ.1.18 లక్షల జరిమానా..!

KMR: మద్యం తాగి వాహనాలు నడిపి ప్రాణాలకు ముప్పు తెస్తున్న వారిపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. SP రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 119 మందికి శుక్రవారం కోర్టు జరిమానాతో పాటు శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసుల్లో నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రూ.1,18,100 జరిమానా విధించింది.

February 27, 2026 / 08:48 PM IST

బొత్స పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలి: లోకేష్

AP: మాజీమంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురై HYDలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలని, ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలని ఆకాంక్షించారు.

February 27, 2026 / 08:48 PM IST

గుండెపోటుతో వ్యక్తి మృతి

TPT: గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు గూడూరు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. ఈనెల 5వ తేదీన నరసింహారెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అతనికి వైద్య చికిత్స అందిస్తున్న నేపథ్యంలో శుక్రవారం గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారని ఒకటవ పట్టణ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.

February 27, 2026 / 08:47 PM IST

86 గ్రాముల హైడ్రోపోనిక్ గాంజా స్వాధీనం

SRD: మునిపల్లి(మం) కంకుల్ టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికారులు జిల్లాలో తొలిసారిగా ఎన్వారి గ్రాముల హైడ్రోపోనిక్ గాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. కేరళకు చెందిన బాబు 30 గోవా నుంచి హైదరాబాద్‌కు గాంజా తరలిస్తుండగా పట్టుకున్నారు. 3.5 లక్షల విలువ ఉంటుందని ఎక్సైజ్ కమిషనర్ హరికిషన్ తెలిపారు.

February 27, 2026 / 08:46 PM IST

పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణతో సర్టిఫికెట్లు పంపిణీ

ELR: నూజివీడు పట్టణంలోని స్త్రీ శక్తి భవన్ లో పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ సర్టిఫికెట్స్ శుక్రవారం అందించారు. జిల్లా కోఆర్డినేటర్ గొట్టుముక్కల సీతారామాంజనేయ రాజు, ట్రైనర్ బీవి రావులు మాట్లాడుతూ.. నిత్యం కాలువలు రోడ్లను పరిశుభ్రం చేయడంలో పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులు అనేకం అని అన్నారు. సానిటరీ ఇన్‌స్పెక్టర్ సంతోష్ పాల్గొన్నారు.

February 27, 2026 / 08:46 PM IST

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం

KNR: తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రాహ్మోత్సవాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీర్వాదం ఈ ప్రాంత ప్రజలపై ఉండి సమృద్ధి వర్షాలతో పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నానని తెలిపారు.

February 27, 2026 / 08:44 PM IST

సెలబ్రిటీల పెళ్లంటే ఎర్ర చీరేనా..?

నిన్న హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లిలో రష్మిక ఎర్ర(కుంకుమ) రంగు చీరలో మెరిసిపోయింది. కాగా, సెలబ్రిటీలు అందరూ వారి పెళ్లిళ్లో ఎరుపు రంగు చీర కట్టుకోవడం విశేషం. నయనతార, సమంత, లావణ్య త్రిపాఠి, అదితిరావు, దీపిక ఇలా అందరూ ఎర్రరంగు చీర కట్టుకున్నారు. ఎర్ర చీరను ప్రేమ, సంపద, కొత్త జీవితానికి సంకేతంగా చూస్తారు. 

February 27, 2026 / 08:43 PM IST

నిధులు కేటాయించాలని ఎంపీకి వినతి అందజేత

KMM: చింతకాని మండలం చిన్నమండవ గ్రామ అభివృద్ధికి ఎంపీ లాండ్స్ నిధులు కేటాయించాలని సర్పంచ్ పర్చ రామచంద్రరావు, రామసహాయం రఘురామరెడ్డిని శుక్రవారం కలసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదల, రహదారులు, డ్రైనేజీ, కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు అవసరమని వివరించారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ, సాధ్యమైనంత నిధులు కేటాయిస్తానని తెలిపారు.

February 27, 2026 / 08:42 PM IST

AIMIMఆధ్వర్యంలో ఘనంగా దావత్-ఇ-ఇఫ్తార్‌

HYD: AIMIM ఆధ్వర్యంలో మలక్‌పేట నియోజకవర్గం పరిధిలోని అక్బర్ బాగ్ ‘X’ రోడ్‌లో గ్రాండ్ దావత్-ఇ-ఇఫ్తార్‌ ఘనంగా జరిగింది. విందుకు AIMIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలాతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా మత పెద్దలతో కలిసి ప్రతేక్య ప్రార్ధనలు (దువా) నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న ముస్లిం సోదరులు విందు ఆరిగించారు.

February 27, 2026 / 08:42 PM IST

తాడేపల్లిగూడెంలో ఇద్దరి అరెస్ట్..!

WG: గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా దెందుకూరి చిదంబర్ వెంకటరాజు అలియాస్ వంశీ, షేక్ అక్బర్‌లను ఆరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ ఆది ప్రసాద్ తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. ముందస్తు సమాచారం మేరకు పట్టణంలోని బల్బు మేడ రోడ్డులో వీరిని అదుపులోకి తీసుకుని కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

February 27, 2026 / 08:42 PM IST

సర్వే వేగవంతం చేయాలి: కమిషనర్

కడప: నగర పాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్తి పన్ను వసూళ్లను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో యూఎఫ్‌ఎస్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేసి, సిబ్బంది పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు.

February 27, 2026 / 08:40 PM IST

మార్చి 2 నుంచి సర్పంచులకు శిక్షణ

ADB: నార్నూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీల సర్పంచులకు మార్చి 2 నుంచి 7వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు MPO మహేష్ తెలిపారు. ఉట్నూరులోని స్థానిక KB కాంప్లెక్స్‌లో జరిగే ఈ శిక్షణలో ఉన్నతాధికారుల ద్వారా సర్పంచుల విధి, బాధ్యతలపై ట్రైనింగ్ ఇవ్వనున్నామన్నారు. దీంతో ప్రతిఒక్కరు హాజరుకావాలని ఆయన కోరారు.

February 27, 2026 / 08:38 PM IST

పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

MDK: ఘనపూర్ ప్రాథమిక పాఠశాలలో స్వయంపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. హెచ్ఎంగా దొడ్ల అవంతిక, ఎంఈవోగా ఆకుల శ్రీనివాస్, డీఈవోగా సాయిచరణ్ వ్యవహరించారు. పిల్లలు పాఠాలు బోధిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల హెచ్ఎం సుజాత బహుమతులు అందజేశారు.

February 27, 2026 / 08:37 PM IST

‘వాస్తవాలు తెలుసుకోకుండా నివేదిక ఇవ్వడం సరికాదు’

BDK: టేకులపల్లి మండల కేంద్రంలో TSTTF ఉపాధ్యాయ సంఘం ముఖ్య నాయకులు శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆకునూరి మురళి ఛైర్మన్ విద్యా కమిషన్ నివేదించిన రిపోర్టును పరిశీలిస్తే ఉద్యోగ ఉపాధ్యాయులను అవమానించినట్టుగా ఉందని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా నివేదిక ఇవ్వడం సరికాదన్నారు.

February 27, 2026 / 08:37 PM IST

జిల్లా కేంద్రంలో ఇంటర్ మూల్యాంకన కేంద్రం ప్రారంభం

నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శుక్రవారం ఇంటర్మీడియట్ మూల్యాంకన కేంద్రాన్ని జిల్లా మాధ్యమిక విద్యాశాఖ అధికారి పరుశురామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మూల్యాంకనాన్ని అధ్యాపకులు పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సీసీవో సుదర్శన్, ఏసీవో తుకారం, అధ్యాపకులు విజయలక్ష్మి, నవీన్ కుమార్, గౌతమ్‌లు పాల్గొన్నారు.

February 27, 2026 / 08:37 PM IST