• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేసే లక్ష్యంతో పనిచేయాలి: మంత్రి

MLG: ఎర్రమంజిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో, గ్రామీణ మంచినీటి సరఫరా, వేసవి సన్నద్ధతపై మంత్రి సీతక్క రివ్యూ నిర్వహించారు. ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేసే లక్ష్యంతో మిషన్ భగీరథ సిబ్బంది పని చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేలా నిధులు మంజూరు చేయాలని మంత్రి కోరారు.

February 24, 2026 / 04:26 PM IST

సస్యరక్షణ చేపడితే అధిక దిగుబడులు: ADA

SRD: సమగ్ర సస్యరక్షణ చేపడితే పంట అధిక దిగుబడులు సాధించవచ్చని ఖేడ్ ADA నూతన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామంలోని రైతు వేదికలో రైతులకు సమావేశపరిచి పంటల సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. రబీ సీజన్ పంటలు పూర్తవగానే చేనులో వేసవి దుక్కులు దున్నడం అవసరమని సూచించారు. సకాలంలో సస్యరక్షణలు చేపడితే పంట భూమిలో కీటకాలు ఉండవన్నారు.

February 24, 2026 / 04:25 PM IST

ఇంటర్, SSC విద్యార్థులకు GOOD NEWS

TG: ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్, SSC పరీక్షలకు 5 నిమిషాలు ఆలస్యంగా హాజరుకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. పరీక్షలో అవకతవకలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

February 24, 2026 / 04:25 PM IST

బ్యాక్‌లాగ్ ప్రవేశ పరీక్షలు వాయిదా

SKLM: పెద్దపాడులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్‌‌లాగ్ ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. మార్చి 2న నిర్వహించాల్సిన ఈ పరీక్షలను మార్చి 8వ తేదీకు మార్చినట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దేవి మంగళవారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

February 24, 2026 / 04:23 PM IST

‘డొక్కా సీతమ్మ ఆశయాల కోసం జనసేన కృషి’

KKD: డొక్కా సీతమ్మ ఆశయాలతో పేదల కోసం జనసేన కృషి చేస్తుందని జగ్గంపేట జనసేన పార్టీ ఇంఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు జగ్గంపేటలో పాత పోలీస్ స్టేషన్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే డొక్కా సీతమ్మ ఉచిత క్యాంటీన్ ను దాతల సాయంతో నిర్వహించి 500 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు.

February 24, 2026 / 04:23 PM IST

BREAKING: టీమిండియా కెప్టెన్‌కు గాయం

భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గాయపడింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆమెకు మోకాలి నొప్పి మళ్ళీ తిరగబెట్టింది. దీంతో హర్మన్ ఫీల్డింగ్‌కు రాలేదు. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ.. ప్రస్తుతం ఆమెను వైద్య బృందం పర్యవేక్షిస్తోందని తెలిపింది. అయితే, 36 ఏళ్ల హర్మన్ గత కొంత కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతోంది.

February 24, 2026 / 04:22 PM IST

రిష్వంత్ రాయ్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ఆహ్వానం

ATP: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన అక్కల రిష్వంత్ రాయ్ (రిషి), తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే పరిటాల సునీతను ఆహ్వానించారు. మార్చి 8వ తేదీన జరగనున్న ఈ కార్యక్రమానికి సకుటుంబంగా రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా రిష్వంత్ రాయ్‌ను ఎమ్మెల్యే సునీత ప్రత్యేకంగా అభినందించారు.

February 24, 2026 / 04:20 PM IST

గుండెపోటుతో ఫైర్ ఏఎస్ఐ మృతి

NLR: కావలి అగ్నిమాపక స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మైనంపాటి సుధాకర్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. మైనంపాటి సుధాకర్ ఇటీవల విధులకు సెలవు పెట్టి కారులో హైదరాబాదుకు వెళుతుండగా మార్గమధ్యంలో గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. సుధాకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

February 24, 2026 / 04:20 PM IST

రాష్ట్ర ప్రభుత్వ క్యాలెండర్ ఆవిష్కరణ

KDP: రాష్ట్ర ప్రభుత్వం అధునాతనంగా ప్రచురించిన 2026 సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మంగళవారం అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన క్యాలెండర్లను జిల్లాలోని అన్ని శాఖలకు పంపిణీ చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా అధికారికి కలెక్టర్ సూచించారు.

February 24, 2026 / 04:20 PM IST

21 మందికి జరిమానా.. ముగ్గురికి జైలు

NZB: డివిజన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 24 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని ఇవాళ జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వారిలో 21మందికి రూ.2.10లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. మరో ముగ్గురికి ఒక్కొక్కరికి వారంపాటు జైలు శిక్ష పడింది. అంతకుముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

February 24, 2026 / 04:20 PM IST

పుట్టపర్తిలో పోలీసుల హై అలర్ట్

సత్యసాయి: పుట్టపర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ పేరుతో నకిలీ ఐడీ నుంచి ఈ బెదిరింపు వచ్చినట్లు సమాచారం. డీఎస్పీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో కోర్టు ఆవరణలో అణువణువు తనిఖీలు చేపట్టారు.

February 24, 2026 / 04:20 PM IST

పురుగుల అన్నంపై గురుకుల విద్యార్థినుల ధర్నా

BHNG: బీబీనగర్ గూడూరు బాలికల గురుకుల పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించారు. నీళ్లచారు, పురుగుల అన్నం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా BRS నాయకులు ధర్నాలో పాల్గొని, విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకోవద్దని డిమాండ్ చేశారు. మెరుగైన భోజనం, వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

February 24, 2026 / 04:20 PM IST

చిన్నారి మృతికి పోలీసులదే బాధ్యత: CPM

GDWL: అన్యాయంగా పసిపాపను చంపిన హంతకులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారు అని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం గద్వాల పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. కుమ్మేర జాతరలో చిన్నారి మృతికి కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. విచారణను తప్పుదోవ పట్టిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

February 24, 2026 / 04:18 PM IST

విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి: ABVP

NLG: దేవరకొండ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ పరీక్ష తరగతి గదులలో విద్యార్థుల సమస్యలపై మంగళవారం ఆర్డీవో ఆఫీస్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్ మాట్లాడుతూ.. రేపటి నుంచి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్ష రాసే గదులలో విద్యుత్ లైట్లు, ఫ్యాన్స్ , మంచినీటి వసతి, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.

February 24, 2026 / 04:18 PM IST

‘రైల్వే అండర్ బ్రిడ్జి రహదారిపై గుంతలను పూడ్చాలి’

మంచిర్యాల రైల్వే అండర్ బ్రిడ్జి రహదారిపై ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చాలని 55వ డివిజన్ కార్పొరేటర్ గాండ్ల సత్తమ్మ కోరారు. మంగళవారం కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రోడ్డుపై ఉన్న గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు రోడ్డు మరమ్మతులు త్వరగా చేపట్టాలని ఆమె కోరారు.

February 24, 2026 / 04:18 PM IST