• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు’

VZM: జిల్లా వ్యాప్తంగా ఇవాళ నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా కె.ఎల్. పురంలోని శ్రీ లక్ష్మీగణపతి జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదులను సందర్శించారు.

February 23, 2026 / 11:00 AM IST

పెట్రోల్ దాడిలో గాయపడిన వ్యక్తి మృతి

KKD: తునిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీరామ థియేటర్ సెంటర్లో బుధవారం జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సైకిల్ మెకానిక్ నానాజీ సోమవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్ మెకానిక్, సైకిల్ మెకానిక్ మధ్య జరిగిన ఘర్షణ ఆగ్రహానికి లోనైన బైక్ మెకానిక్, నానాజీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో ఇవాళ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

February 23, 2026 / 11:00 AM IST

‘తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు’

NRML: నిర్మల్‌లో ఆదివారం జరిగిన సాధారణ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని ASP సాయికిరణ్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై ఒక కేసు, కారును ధ్వంసం చేసిన వ్యక్తిపై మరో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు నేటి ప్రకటనలో హెచ్చరించారు.

February 23, 2026 / 11:00 AM IST

ప్రశాంత వాతావరణంలో ఇంటర్ పరీక్షలు

కృష్ణా: గుడివాడలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకొని పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నిబంధనలకు అనుగుణంగా కేంద్రాల్లోకి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అధికారులు చర్యలు చేపట్టారు.

February 23, 2026 / 11:00 AM IST

గుత్తి ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా

ATP: గుత్తి ICDS కార్యాలయం ఎదురుగా సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది CITU ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నాయకులు రమేష్ మాట్లాడుతూ.. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 11:00 AM IST

యువకుడి వివాహానికి కేశవరెడ్డి ఆర్థిక సాయం

ATP: గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు కుమారుడు రవి వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి సోమవారం రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబాల పెళ్లిళ్లకు తోడ్పాటు అందించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

February 23, 2026 / 11:00 AM IST

గ్రామపంచాయతీలకు నిధులు విడుదల

BHNG: జిల్లాలోని 427 గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.7.59 కోట్లు జమ అయ్యాయి. జనాభా ప్రాతిపదికన ఒక్కో పంచాయతీకి రూ.48 వేల నుంచి రూ.9.8 లక్షల వరకు అందాయి. ఈ నిధుల్లో 60 శాతాన్ని తాగునీరు, పారిశుద్ధ్య పనులు, మిగిలిన 40 శాతాన్ని పెండింగ్ బిల్లులు, ఇతర అభివృద్ధి పనులకు మార్చి 31లోగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

February 23, 2026 / 10:59 AM IST

సింగరేణిలో ఫీజు రియంబర్స్ చెల్లింపు

MNCL: 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఐఐటీలో సింగరేణి ఉద్యోగుల పిల్లల ప్రవేశం కోసం ట్యూషన్ ఫీజు రియంబర్స్ చెల్లింపుకు సంంధించించి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ఈ పథకం 2025-26 విద్యా సంవత్సరంలో ఐఐటీలో ప్రవేశంపై వర్తిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులు ఐఐటీలో ప్రవేశం, ట్యూషన్ ఫీజు రశీదులు, ఇతర రుజువులతో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.

February 23, 2026 / 10:57 AM IST

క్రీడల్లో ప్రతిభ చాటిన అచ్చంపేట బిడ్డ

NGKL: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి “వుషూ” క్రీడా పోటీల్లో పీఎంశ్రీ ప్రభుత్వ హైస్కూల్ అచ్చంపేట విద్యార్థి శివప్రసాద్ పాల్గొని ద్వితీయ స్థానం సాధించాడు. పోటీల్లో ప్రతిభ కనబరిచి పాఠశాల, అచ్చంపేటకు కీర్తి తీసుకొచ్చాడు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.

February 23, 2026 / 10:53 AM IST

డివైడర్ను ఢీకొట్టి నిలిచిపోయిన ట్రాలర్

VSP: భారీ వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్యంతో హనుమంతువాక-మధురవాడ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎండాడ సిగ్నల్ వద్ద కంటైనర్ తీసుకెళ్తున్న భారీ ట్రాలర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఎస్ఐ ధర్మేందర్ సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టారు.

February 23, 2026 / 10:52 AM IST

లోకేష్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ బొత్స కౌంటర్

AP: మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. లడ్డూ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? అనవసరమన్నారు. మండలిలో మాత్రం చర్చ జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉందని తెలిపారు.

February 23, 2026 / 10:51 AM IST

పొంగుతున్న డ్రైనేజీ.. దుర్గంధంతో ఇబ్బంది

NLG: చిట్యాల బస్టాండ్ సమీపంలో ఉన్న 8వ వార్డులో భూగర్భ డ్రైనేజీ సమస్యతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో మురుగునీరు సాఫీగా పారక బయటకు పొంగుతోంది. దుర్గంధంను స్థానికులు భరించలేకపోతున్నారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని నివాసితులు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

February 23, 2026 / 10:47 AM IST

తెలంగాణ కబడ్డీ జట్టు కెప్టెన్ గా జిల్లా బిడ్డ

GDWL: తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్ గా గద్వాల కు చెందిన జి.రాజు ఎంపికైనట్లు కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డీకే స్నిగ్ధా రెడ్డి తెలిపారు. గుజరాత్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే జాతీయస్థాయి సీనియర్ కబడ్డీ టోర్నీలో తెలంగాణ జట్టుకు సారథ్యం వహించనున్నారు. ఉమ్మడి జిల్లా నేతలు, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పీడీలు హర్షం వ్యక్తం చేశారు.

February 23, 2026 / 10:47 AM IST

బోధన సామర్థ్యం పెంచుకోవాలి: హెచ్‌ఎం శారద

SRD: ముత్తంగి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సోమవారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. కాంప్లెక్స్ హెచ్‌ఎం శారద మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా బోధన నాణ్యత పెరుగుతుందని తెలిపారు. ఉత్తమ బోధన పద్ధతులతో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచవచ్చన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుకు కృషి చేయాలని ఆమె సూచించారు.

February 23, 2026 / 10:45 AM IST

నేటి ఎమ్మెల్యే పర్యటన వాయిదా

NRML: నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈరోజు దిలావర్పూర్ మండలంలోని కాలువ, సిర్గాపూర్ గ్రామాల్లో చేపట్టాల్సిన శంకుస్థాపన కార్యక్రమాలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయని నీటిపారుదల శాఖ ఏఈ సొన్ కాంబ్లే గంగాధర్ ఓ ప్రకటనలో తెలిపారు, ప్రజా ప్రతినిధులు, అధికారులుఈ మార్పును గమనించాలని వారి కోరారు.

February 23, 2026 / 10:44 AM IST