• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘనంగా ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం

VSP: చినగదిలిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఇవాళ ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 23న పద్మశ్రీ పి.సి.సర్కార్ జన్మదినాన్ని పురస్కరించుకుని బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలికలు చదువుతో పాటు కళల్లోనూ రాణించాలని నిర్వాహకులు సూచించారు.

February 23, 2026 / 11:50 AM IST

నర్సీపట్నంలో న్యాయవాదులు నిరసన

AKP: నర్సీపట్నం న్యాయస్థానాల ఆవరణలో సోమవారం న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ట ప్రభాకర్ మాట్లాడుతూ కర్నూలు సిటీలో పవన్ కుమార్ అనే న్యాయవాది మీద సీఐ విక్రమ సింహ దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

February 23, 2026 / 11:49 AM IST

మరికల్‌లో బీజేపీ నాయకుల నిరసన

NRPT: మరికల్ మండల కేంద్రంలో సోమవారం BJP మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ ఆధ్వర్యంలో BJP నాయకులు నల్లబ్యార్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు గుండా గురిని ఖండిస్తూ నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్యకర్తలు ఉన్నారు.

February 23, 2026 / 11:48 AM IST

‘ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షల ప్రారంభం’

MNCL: లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ బుధవారం నుండి ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మొదటి సంవత్సరంలో 453, ద్వితీయ సంవత్సరంలో 211 మొత్తం 463 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు.

February 23, 2026 / 11:47 AM IST

చేనేత అంశంపై మంత్రి సవిత సమాధానం

సత్యసాయి: బడ్జెట్ సమావేశాల్లో సోమవారం మంత్రి సవిత పాల్గొన్నారు. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. చీరాల చేనేత క్లస్టర్‌కు రూ.4.17 కోట్లు మంజూరు చేశామని, చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిపారు. ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

February 23, 2026 / 11:47 AM IST

గొడవ పడి తండ్రిపై దాడి చేసిన కొడుకు

కృష్ణా: పామర్రు మండలం కొండిపర్రు గ్రామంలో దారుణ ఘటన ఇవాళ చోటు చేసుకుంది. వేడి నీళ్లు కాస్తున్న సమయంలో తండ్రి సురేష్‌తో గొడవ పడిన కొడుకు మహేష్ కత్తితో దాడి చేశాడు. తండ్రిని మన వద్ద నరకడంతో తీవ్రంగా గాయపడిన సురేష్‌ను మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోని ఆయన మృతి చెందాడు. కొడుకు మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

February 23, 2026 / 11:46 AM IST

రెండేళ్లుగా మూలన బోరు.. తాగునీటికి ఇబ్బంది

ASR: డుంబ్రిగుడ సామాజిక భవనం వద్ద ఉన్న తాగునీటి బోరు రెండేళ్లుగా పాడై నిరుపయోగంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరు పాడవడంతో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామంటున్నారు.పలుమార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

February 23, 2026 / 11:46 AM IST

జిల్లాలో పర్యటించనున్న శ్రీ వాగ్దేవి కళా పీఠం వ్యవస్థాపకులు

శ్రీ వాగ్దేవి కళా పీఠం వ్యవస్థాపకులు శ్రీనివాసమూర్తి ఈనెల 24న విజయనగరం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నారు. ఆరోజు ఉదయం 10 గంటలకు గురజాడ పాఠశాలలో జరుగనున్న కార్యక్రమంలో తెలుగు భాషా ప్రాశస్త్యం అనే అంశంపై ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అందరు హాజరు కావాలని కోరారు.

February 23, 2026 / 11:45 AM IST

జూనియర్ కళాశాల విద్యార్థినికి మెడల్

MNCL: జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎండి.అస్మా రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో విజేతగా నిలిచారు. అస్మా రాష్ట్ర స్థాయిలో జరిగిన కరాటే పోటీలలో మూడో స్థానంలో సాధించారు. దీంతో నిర్వాహకులు ఆమెకు ట్రోఫీతో పాటు రూ.5000 నగదు బహుమతిని అందజేశారు. ఆమెను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు అభినందించారు.

February 23, 2026 / 11:45 AM IST

ప్రారంభానికి ముందే మల్లంపల్లిలో ‘పల్లె దవాఖానా’ బేజారు

SDPT: అక్కన్నపేట(M) మల్లంపల్లిలో నిర్మించిన పల్లె దవాఖానా ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకుంది. భవన నిర్మాణ పనులు పూర్తికాకముందే తలుపులు, కిటికీలు ఊడిపోయి భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

February 23, 2026 / 11:45 AM IST

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

MNCL :కన్నెపల్లి మండలం జంగంపల్లికి చెందిన టకిరే నాగేశ్ (23) సోమవారం పంటలకు వాడే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, మూడేళ్ల కుమార్తెతో పాటు 3నెలల శిశువు ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్న కుటుంబంలో నాగేశ్ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది.

February 23, 2026 / 11:45 AM IST

ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి తీవ్ర జ్వరం

TG: కామారెడ్డి BJP MLA కాటిపల్లి వెంకటరమణారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండు, మూడు రోజులుగా రాజకీయ పరిణామాల ఒత్తిడి నేపథ్యంలో జ్వరంతో బాధపడుతున్నారు. అయితే, ఎమ్మెల్యే పోలీసుల బందోబస్తు మధ్య గృహ నిర్బంధంలో ఉండగా.. డాక్టర్లను నేరుగా ఆయన నివాసానికే పిలిపించి ప్రాథమిక వైద్య పరీక్షలు చేయించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేకు ఇంటి వద్దే మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

February 23, 2026 / 11:45 AM IST

అంగన్వాడీలకు కొత్త వెలుగులు

NRML:  జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలలో విద్యుత్ మీటర్ల బిగింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జిల్లాలోని మొత్తం 381 అంగన్‌వాడీ కేంద్రాలకు మీటర్లు అవసరమవగా, ఇప్పటికే 290 కేంద్రాల్లో మీటర్లు ఏర్పాటు చేశారు. మిగిలిన కేంద్రాల్లో త్వరలోనే పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు నేటి ప్రకటనలో తెలిపారు.

February 23, 2026 / 11:44 AM IST

రూ.10 కోట్లతో గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు

HYD: సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త సర్పంచులకు సరికొత్త కానుకగా గ్రామీణ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ఆయా గ్రామాలలో కలిపి మొత్తం రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. త్వరలో వార్డుల వారిగా అభివృద్ధి చేపడుతానని వెల్లడించారు.

February 23, 2026 / 11:43 AM IST

మంత్రిని కలిసిన కౌన్సిలర్లు

SRCL: మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సిరిసిల్ల మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిని కలిసిన వారిలో ఆడెపు చంద్రకళ, బొద్దుల శ్రీనివాస్, వెంగళ లీల, కూరపాటి శ్రీశైలం, లింగంపల్లి గంగరాజు ఉన్నారు. ఈ సందర్భంగా వారిని మంత్రి అభినందించారు.

February 23, 2026 / 11:43 AM IST