TG: ఫిబ్రవరి ముగియకముందే ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో రేపట్నుంచి పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 22 జిల్లాల్లో 35-36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యే ఛాన్స్ ఉందంటూ.. ఆయా జిల్లాలకు మెల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రి ఉష్ణోగ్రతలు ఇప్పటికే పలు జిల్లాల్లో 15-20 మధ్య నమోదవుతున్నాయి.
కృష్ణా: పెడన మండలంలోని అచ్చయ్యవారిపాలెం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఎంపీడీవో అరుణ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు నాణ్యత ప్రమాణాలతో నిర్వహించాలని అధికారులకు ఆమె సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరు పంచాయతీ కార్యదర్శి జానకి పాల్గొన్నారు.
సత్యసాయి: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి బుధవారం అసెంబ్లీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు. రూ. 20 వేలలోపు వేతనం పొందుతున్న వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా ప్రత్యేక జీవో జారీ చేయాలని కోరారు. గతంలో ఇచ్చిన క్రమబద్ధీకరణ హామీలను అమలు చేసి అర్హులైన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
E.G: విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో బుధవారం “ఆంధ్రప్రదేశ్ ఆటవిడుపు – 2026” క్రీడోత్సవాలు ఘనంగా జరిగాయి. నిడదవోలు MLA కందుల దుర్గేశ్ ఈ పోటీల్లో పాల్గొని టగ్ ఆఫ్ వార్, రన్నింగ్, కబడ్డీ ఆడి అలరించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు జట్టు భావనను పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకలో పలువురు MLAలు, MLCలు పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటారు.
BDK: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నేడు చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఉదయం అన్నపురెడ్డిపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ, సేవాలాల్ జయంతి వేడుకలో పాల్గొంటారని అన్నారు. మధ్యాహ్నం చంద్రుగొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభిస్తారని అన్నారు.
NTR: విజయవాడలో నాణ్యమైన జనరిక్ మందుల ప్రోత్సాహకంపై ముద్రించిన అవగాహన పోస్టర్లను లక్ష్మీశ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు స్వయంగా మందులు తీసుకోవడం నివారించాలని సూచించారు. లైసెన్స్ ఉన్న మెడికల్ షాపుల నుంచి బిల్లులతో మందులు కొనుగోలు చేయాలని, గడువు తేదీని తప్పనిసరిగా పరిశీలించి, వైద్యుల సూచించిన విధంగా మందులు వాడాలన్నారు.
MLG: మంగపేట మండలం కమలాపురం గ్రామంలో శంకర్ అనే వ్యక్తిపై రెండు రోజుల క్రితం జరిగిన బీరు బాటిల్ దాడి కేసులో, నిందితులైన నితిన్, రాకేష్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసులు నిందితులను అనంతరం పరకాల సబ్ జైల్‌కు తరలించి కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ADB: బ్యాంకింగ్ లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని DCCB బ్యాంక్ సమావేశ మందిరంలో బ్యాంక్ మేనేజర్లు, నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి నెలాఖరు నాటికి నిర్దేశించుకున్న అన్ని బ్యాంకింగ్ లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
NRPT: జిల్లా వైద్య ఆరోగ్య శాఖపై నారాయణపేట కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జిల్లాలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక అర్బన్ హెల్త్ సెంటర్, 27 సబ్ సెంటర్లు, 59 పల్లె దవాఖానాల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించారు. వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగేలా చికిత్సలు అందించాలని అన్నారు.
SKLM: సోంపేట మండల పరిషత్ కార్యాలయంలో పీఎం సూర్య ఘర్ పథకం (సోలార్ రూఫ్ టాప్)పై ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తు న్నట్లు పలాస ఈఈ యజ్ఞేశ్వర రావు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో సోలార్ రూ ప్టాప్ పెట్టుకోవడం వలన కలుగు లాభాలు, రాయితీ, బ్యాంకు రుణాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
NZB: కమ్మర్‌పల్లి మండలం ఉప్పులూరులో రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర మల్లన్న జాతరలో రెండు నెలల పసికందును ప్రాణం తీసిన నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆ పాపకు నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
HYD: నగరంలో అనేక చోట్ల దోమల బెడద ప్రజలకు కంటినిండా కునుకు లేకుండా చేస్తుంది. గల్లీలలో పొగబెట్టినా.. దోమల బెడద తగ్గట్లే, నిద్ర పోనిస్తలే. ఈ నరకంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని రాజేంద్రనగర్, మల్కాజ్‌గిరి, నాచారం, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంత ప్రజలు వాపోతూ ఆవేదన వ్యక్తం చేశారు. దోమల బెడదకు కారణమేంటో కనుగొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ELR: కైకలూరు మండలం తామరకొల్లు గ్రామంలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాడపాటి నాగరాజుకు చెందిన సుమారు మూడు ఎకరాల వరిగడ్డి అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న కైకలూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో రూ.40 వేల విలువైన గడ్డివాము నష్టం వాటిల్లినట్లు యజమాని తెలిపారు.
NRML: జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గంజాయి, నాటు సారా, ఇతర నిషేధిత పదార్థాలను గుర్తించి, కేసులు నమోదు చేయాలన్నారు. మత్తు పదార్థాలు వాడటం వల్ల జీవితాలు నాశనం అవుతాయని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
HNK: హసన్ పర్తి మండలం సిద్దాపూర్‌కు చెందిన బాల్నే మొగిలిని హత్య కేసులో నిందితురాలైన ఆమె మరదలు వంగ ఇందిరను బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ చేరాలు తెలిపారు. డబ్బుల విషయంలోని గొడవ కారణంగా నిందితురాలు బండరాయితో కొట్టి, కత్తితో పొడిచి అతన్ని హత్య చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వంగ ఇందిరను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.