• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మరికొద్ది సేపట్లో ‘రుద్రమ-1’రాకెట్ లాంచ్

WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని భద్రకాళీ బండ్ వద్ద మరికొద్ది సేపట్లో ‘రుద్రమ-1’ మోడల్ రాకెట్‌ను ప్రయోగించనున్న విషయం తెలిసిందే. 250 గ్రాముల బరువు, 4 అడుగుల ఎత్తు ఉన్న ఈ చిన్న రాకెట్ శాస్త్ర సాంకేతిక రంగంలో ఆసక్తి ఉన్నవారిని ఆకర్షిస్తుందని నిర్వాహకులు తెలిపారు. రాకెట్ ప్రయోగం సమయంలో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

February 28, 2026 / 05:14 PM IST

సీసీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

BHNG: ఆలేరు మండలం మంతపురి గ్రామంలో ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధుల కింద రూ. 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ సతీష్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి దిశగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపదుతుందన్నారు.

February 28, 2026 / 05:13 PM IST

‘విశ్రాంతి జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలి’

WNP: జిల్లా పోలీస్ శాఖలో మూడు దశాబ్దాలకు పైగా క్రమశిక్షణ, ప్రజా సేవలకు ప్రతీకగా నిలిచిన పెబ్బేరు ఏఎస్సై బాలస్వామి సేవలు ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో బాలస్వామి వేడుకలు కార్యక్రమం నిర్వహించారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా ఉండాలన్నారు.

February 28, 2026 / 05:13 PM IST

తిరుమలలో యూట్యూబర్ రీల్స్.. TTD వార్నింగ్

TPT: తిరుమలలో రీల్స్ చేసిన యూట్యూబర్ గీతూ రాయల్ అండ్ టీమ్‌పై TTD ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వప్రయోజనాల కోసం కొండపై అసత్య కథనాలతో రీల్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా ఇవాళ ఘాట్ రోడ్డుతో పాటు ఆలయం ఎదుట, పుష్కరిణి సమీపంలో, కౌంటర్ల వద్ద గీతూ రాయల్ అండ్ టీం రీల్స్ చిత్రీకరించి SMలో పోస్ట్ చేశారు.

February 28, 2026 / 05:13 PM IST

మార్చిలో కొత్త కార్ల సందడి

మార్చిలో భారత ఆటోమొబైల్ రంగం కొత్త మోడళ్లతో కళకళలాడనుంది. రెనాల్ట్ డస్టర్(మార్చి 17) రీ-ఎంట్రీ ఇస్తుండగా, లగ్జరీ విభాగంలో మెర్సిడెస్ V-క్లాస్(మార్చి 2), ఆడి SQ8 పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో వస్తున్నాయి. వీటితో పాటు స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్, టొయోటా ఎబెల్లా EV SUVలు మార్కెట్లోకి వస్తాయి. బడ్జెట్ నుంచి లగ్జరీ వరకు కస్టమర్లకు భారీ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి.

February 28, 2026 / 05:13 PM IST

షాదీఖానా నిర్మాణానికి స్థలం అప్పగింత

SRPT: మేళ్లచెరువు మండల కేంద్రంలో షాదీఖానా నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 20 కుంటల (అర ఎకరం) భూమిని శనివారం రెవెన్యూ, మైనార్టీ వెల్ఫేర్ అధికారులు పరిశీలించి అప్పగించారు. రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో ఈ స్థలం మంజూరైందని మండల మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ సైసా తెలిపారు.

February 28, 2026 / 05:12 PM IST

నాచగిరి బ్రహ్మోత్సవాలకు మంత్రికి ఆహ్వానం

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 8 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి తదితరులకు ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈవో రంగాచారి, వేద పండితులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

February 28, 2026 / 05:12 PM IST

ఆదర్శ పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలు

PDPL: ధర్మారం తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇవాళ జాతీయ సైన్స్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు తయారుచేసి ఎగ్జిబిట్ చేశారు. అలాగే సైన్స్ క్విజ్, ఎస్సే రైటింగ్ పోటీలు నిర్వహించారు. సైన్స్ పోటీల వల్ల విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందుతుందని ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

February 28, 2026 / 05:11 PM IST

‘అమ్మకు మించిన దైవం లేదు’

సంగారెడ్డి: జహీరాబాద్ అమ్మకు మించిన దైవం లేదని, తల్లిదండ్రులను గౌరవించడం ప్రతి ఒక్కరి ప్రథమ కర్తవ్యమని మహామండలేశ్వర్ శ్రీ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి డాక్టర్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ అన్నారు. యువత మంచి మార్గంలో నడుస్తూ పెద్దలు చూపిన దారిలో సాగాలన్నారు. కుటుంబ విలువలను కాపాడితే సమాజం సుభిక్షంగా ఉంటుందని సూచించారు.

February 28, 2026 / 05:10 PM IST

కనకదుర్గమ్మను దర్శించుకున్న కోమటిరెడ్డి

TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ తెల్లవారుజామున విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.

February 28, 2026 / 05:10 PM IST

రెడ్ క్రాస్ సొసైటీకి అండగా నిలవాలి: ఎంపీ

ELR: లాభాపేక్ష లేకుండా సమాజానికి సేవ చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీకి అందరూ అండగా నివాల్సిన అవసరం ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఏలూరు రెడ్ క్రాస్ సంస్థ భవనంలో 2వ అంతస్తు నిర్మాణ పనులకు ఎంపీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తన తల్లి విజయలక్షి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రెడ్ క్రాస్ సంస్థకు ఎంపీ రూ. 2 లక్షల విరాళం అందించారు.

February 28, 2026 / 05:09 PM IST

సింగిరి కోనలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి

TPT: నారాయణవనం మండలం సింగిరి కోన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సరస వెంకటనారాయణబట్టి దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయంలో ఏర్పాటుచేసిన సుదర్శన ధన్వంతరి హోమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ పరిసరాలు, స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం చాలా సంతోషాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.

February 28, 2026 / 05:09 PM IST

‘త్వరలో PHC కేంద్రాల్లో HPV వాక్సినేషన్’

MDCL: మల్కాజ్‌గిరి జిల్లా వ్యాప్తంగా త్వరలోనే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెచ్‌పీవీ (HPV) టీకా కార్యక్రమం ప్రారంభం కానుందని డా. సౌశీల్య తెలిపారు. గర్భాశయ, గర్భద్వార క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని వైద్యులు తెలిపారు. కాగా.. కింగ్ కోఠి ఆసుపత్రిలో మంత్రి రాజనర్సింహ ఈ  కార్యక్రమాన్ని ప్రారంభించారు.

February 28, 2026 / 05:07 PM IST

‘సంబరాల యేటిగట్టు’ షూటింగ్ UPDATE

మెగా హీరో సాయి దుర్గా తేజ్ హీరోగా K.P. రోహిత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘సంబరాల యేటిగట్టు’. ఈ మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ ప్రస్తుతం భారీ ఎత్తున జరుగుతోంది. ఏకంగా 35 రోజుల లాంగ్ షెడ్యూల్‌లో రూ.20 కోట్లకుపైగా బడ్జెట్‌తో 18 గ్రాండ్ సెగ్మెంట్స్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారట. అంతేకాదు కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా ఈ క్లైమాక్స్ ఉండనున్నట్లు టాక్.

February 28, 2026 / 05:06 PM IST

హక్కుల కోసం ‘రజక’ దీక్ష

KNR: శంకరపట్నం మండలం కొత్తగట్టు శ్రీ మత్స్యగిరింద్ర స్వామి ఆలయం వద్ద శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఆలయ యాజమాన్యం, ఛైర్మన్ తమ కులవృత్తి హక్కులకు ఆటంకం కలిగిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన హక్కులను పునరుద్ధరించే వరకు పోరాటం ఆపేది లేదని రజక సంఘం నాయకులు స్పష్టం చేశారు.

February 28, 2026 / 05:05 PM IST